తెలంగాణ

బ్లాక్ చైన్ టెక్నాలజీపై ముసాయిదా పత్రం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: డిజిటల్ టెక్నాలజీ, లావాదేవీలను రికార్డు చేసేందుకు, ఈ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగపడే బ్లాక్ చైన్ పాలసీనీ రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ప్రపంచంలో ఇంతవరకు పది నగరాల్లో బ్లాక్ చైన్ హబ్‌లు ఉన్నాయి. వీటిల్లో హైదరాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం బ్లాక్ చైన్ పాలసీపై ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది. దేశంలో తొలి బ్లాక్ చైన్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేసే ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న జిల్లా ప్రాంతంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీలను నెలకొల్పవచ్చును. ఈ కంపెనీలను నెలకొల్పేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. పరిశ్రమలతో అనుసంధానంతో ఐటీ, డిజిటల్ టెక్నాలజీ నైపుణ్యాభివృద్ధిపై పరిశోధనలు చేస్తారు. వౌలిక సదుపాయాలను పంచుకుంటారు. వీటితో స్టార్టప్‌లు, పరిశ్రమలు, అకాడమీషియన్లు, కమ్యూనిటీస్, ప్రమోషన్,రీసెర్చి, ఇన్నోవేషన్ అభివృద్ధి విస్తరణకు చర్యలు తీసుకుంటారు. ఎంటర్‌ప్రైజస్,స్టార్టప్‌లకు 25 శాతం సబ్సి ఇస్తారు. స్టార్టప్‌లలో రాష్ట్ర జీఎస్‌టీపై 100 శాతం రీఎంబర్స్‌మెంట్ ఇస్తారు. పరిశోధన, అభివృద్ధి విభాగంలో పది శాతం గ్రాంటును ఇస్తారు. పది బ్లాక్ చైన్ స్టార్టప్‌లకు మూడు సంవత్సరాల పాటు సీలానా రూ.10 లక్షల గ్రాంటును ఒక సారి ఇస్తారు.
బ్లాక్ చైన్ విధానాన్ని ప్రకటించడాన్ని ఐటీ కంపెనీలు స్వాగతిస్తున్నాయి. ఐటీ రంగం ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే రూ.1.09 లక్షల కోట్ల ఎగుమతులను సాధించింది. ఇది రికార్డని చెప్పవచ్చును. 2018-19 సంవత్సరంలో అంతకు ముందు ఏడాదితో పోల్చితే 17 శాతం వృద్ధిరేటుతో ఈ వృద్ధిరేటును నమోదం చేసింది.