రాష్ట్రీయం

అశోక వృక్షం... అంజనీసుత రూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూన్ 24: కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, ప్రధాన ద్వారం ఎదురుగా ప్రసన్నాంజనేయ ఆలయాన్ని ఆనుకుని, అంజనీసుతుని రూపుతో ఏపుగా నింగికెదిగిన అశోక వృక్షం చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నది. హనుమంతునితో విడదీయలేని బంధం కలిగి ఉన్న ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారం (రాజగోపురం) ఎదురుగా, ఏపుగా అల్లంత ఎత్తుకు పెరిగి, గ్రామానికి రక్షణగా నిలిచి ఉందా అన్నట్లున్న అశోక వృక్షం అచ్చు ఆంజనేయుని రూపం పోలి ఉండడం గమనార్హం. దేవస్థానంలోకి ప్రవేశించగానే పవన సుతుని రూపు దాల్చిన వృక్షానికి కైమోడ్పులిడిన తర్వాతే భక్తులు ఆంజనేయాలయ, తదనంతరం ప్రధానాలయాల దర్శనాలు చేసుకుంటున్నారు.