తెలంగాణ

నదులతోనే మానవాళి మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 29: భారతదేశ ప్రాచీన నాగరికత, సభ్యతా సంస్కృతులకు మూలాధారాలైన , ప్రాత: స్మరణీయాలైన నదులను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి ఉద్భోదించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరికి మహాహారతి సమర్పించిన విశేష కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దేశ ఔన్నత్యానికి కారణభూతాలైన వేదాలు, శృతి స్మృతులు, పంచ ఆగమాలు, రామాయణ, భారత, భాగవతాలు నదీ తీరాలలోనే రూపుదిద్దుకున్నాయని, మానవ జీవనాధారాలైన నదులు నేడు ప్రగతి పేరున కనుమరుగు అవుతున్నాయని, అది జాతి మనుగడకు ప్రమాదకరమని ఆవేదన వ్యక్త పరిచారు. దైవ, మాతృ స్వరూపమైన గోదావరిని కలుషిత రహితంగా మార్చాలన్నారు.
త్య్రయంబకం వద్ద ఉద్భవించిన గోదావరి బంగాళాఖాతం వరకు అదే ప్రవాహం కలిగి ఉండాలని, కాని అపవిత్రం చేస్తుండడం మూలాన ఉండడం లేదన్నారు. ఒకనాడు గంగానదికి పుష్కరాలలోనే హారతిని నిర్వహించే వారని, నేడు నిత్య హారతిగా మారిందని, గోదావరికీ హారతిని మొక్కుబడిగా కాక, ప్రతినిత్యం ఇవ్వాలని, ఈ స్పూర్తి దేశంలోని సమస్త నదుల రక్షణకై కలుగాలని ఆకాంక్షించారు. విశ్వానికి మనదేశం ఆత్మయని, నదుల పరిరక్షణ ద్వారానే భారత దేశ పునర్వైభవం సాధ్యమన్నారు. సూర్యుడు, నీరు, సర్వవ్యాపితాలని, నాసిక్‌నుండి అంతర్వేది వరకు ప్రవహించే గోదావరి 10కోట్ల మానవులకు, అంతకు మించి జంతువులకు, క్రిమి కీటకాదులకు ప్రాణాధారమన్నారు. రక్షించేవాడు దేవుడని, కాడాడేది తల్లియని, జీవనది గంగా, గోదావరి, గోవులను మాతలుగా కొలిచే గొప్ప విజ్ఞత భారతీయులదన్నారు. ప్రపంచ దేశాలు నీటిని నీటిగానే చూస్తే, భారతీయులు మాతలుగా నదులను పూజించే గొప్ప సంస్కృతి మనదన్నారు. గోదావరి హారతి కార్యక్రమం చాలా గొప్పదని, జీవనది సంరక్షణకు తోడుపడగలదన్నారు. మురళీధర్ రావు చొరవ స్పూర్తినివ్వాలని అన్నారు. వేదవేదాంగాలకు నిలయమైన ధర్మపురి సనాతనంగా ధర్మపరిరక్షణకు కేంద్రస్థానమని, ఆపరంపర కొనసాగాలన్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ శాసనసభ బిజెపి ఉప నాయకుడు రాంచంద్రారెడ్డి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి, విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షులు రాఘవరెడ్డి, బిజెపి జాతీయ నేత సుగుణాకర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల, కోకన్వీనర్ రాంసుధాకర్‌రావు, జిల్లా అధ్యక్షులు వెంకట రమణ, పాపారావు, స్థానిక సర్పంచ్ సత్తమ్మ, డాక్టర్ విజేందర్ రెడ్డి, శేఖర్‌రావు, కొమురయ్య, సుధీశ్ రాంభోట్ల, వీరగోపాల్, కన్నం అంజయ్య, గిరిధర్, పిల్లి శ్రీనివాస్, సంగి నర్సయ్యతో పాటు పలువురు వివిధ స్థాయిల నాయకులు వేదికపై ఉండగా, వేలాదిమంది పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.

కార్తీక రామ పునర్వసు దీక్షలు ప్రారంభం

భద్రాచలం, నవంబర్ 29: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కార్తీక రామ పునర్వసు దీక్షలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రుని మంటపంలో భక్తుల రామనామ సంకీర్తన నడుమ శ్రీ సీతారామచంద్రస్వామి అలంకారమూర్తులకు అభిషేకం నిర్వహించారు. రామ పాదుకలకు పూజలు చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిపాక పుణ్యజలాలను శ్రీరామ దీక్షాపరులపై చల్లారు. తులసి పూజ చేసి రామ మాలలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్బార్ సేవ అనంతరం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఊరేగింపుగా గోదావరి ఒడ్డున పునర్వసు మండపానికి వెళ్లి పూజలందుకున్నారు. అనంతరం మాడవీధుల గుండా స్వామి తిరువీధి సేవకు గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు.