తెలంగాణ

రెవెన్యూ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్హర్, జూన్ 11: రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహించారు. తమ భూములను పట్టాలు చేయమని నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారి పట్టించుకోని వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ వీఆర్‌వోలను నిర్బంధించారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని వల్లెంకుంట గ్రామపంచాయతీలో పలువురు రైతులకు సంబంధించిన భూములను పట్టాలు చేయడంలో రెవెన్యూ సిబ్బంది సాచివేత ధోరణి అవలంబిస్తున్నారు. తమ భూములను పట్టాలు చేయమని ఎన్నిసార్లు అధికారులను అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన పలువురు రైతులు మంగళవారం ఆగ్రహంతో వీఆర్‌వోలను నిర్బంధించారు.
నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు అధికారులను సంప్రదించినా వారం రోజులు గడువు ఇస్తున్నారు తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న రైతుబంధు పథకం, బ్యాంకు క్రాప్ లోన్, ప్రభుత్వ పథకాలు ఏవీ వర్తించడం లేదని, పండించిన పంట కొనుగోలు చేయాలంటే పట్టాపాస్ బుక్ ఉండాల్సిందేనని అధికారులు ఆదేశాలు ఇచ్చినా తమకు పట్టాపాస్ బుక్‌లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు తెలిపారు. తహశీల్దార్, వీఆర్‌వోలు కుమ్మక్కై తమ సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార ఆరోపిస్తూ ఆగ్రహంతో వల్లెంకుంట గ్రామానికి వచ్చిన నలుగురు వీఆర్‌వోలు మల్లేశం, సురేందర్, రవి, మల్లేశంలను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు తాళం తీసేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఈ విషయాన్ని నిర్బంధానికి గురైన వీఆర్‌వో సురేందర్ తహసీల్దార్‌కు ఫోన్‌లో వివరించడంతో స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ వారం రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు వీఆర్‌వోలను వదిలేశారు.