తెలంగాణ

పిల్లలమర్రిలో అతిపురాతన కళాఖండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 12: పిల్లలమర్రిలో అతి పురాతమైన చారిత్రక కళాఖండాలు ఉన్నాయని వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పురావస్తుశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలో పిల్లలమర్రి పర్యాటక కేంద్రంలో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పురావస్తుశాఖ పిల్లలమర్రిలో నిర్మించిన ప్రదర్శనశాలలో అద్భుతమైన అతిపురాతనమైన చారిత్రక కళా ఖండాలు ఉన్నాయని తెలిపారు. వీటిని సందర్శకుల ముందుకు తీసుకురావడాకి పురావస్తుశాఖ కృషి చేస్తుందని, అందులో భాగంగానే పిల్లలమర్రిలో ప్రదర్శనశాలను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ ప్రదర్శన ద్వారా ప్రాచీన సంస్కృతి సంపద భవిష్యత్ తరాలకు అందించడం జరుగుతుందని తెలంగాణలోనే అత్యంత పురాతనమైన చారిత్రక ప్రాంతం పాలమూరు అని ఇది జిల్లా ప్రజలకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ ప్రదర్శనశాలలో 10 వేల ఏళ్లనాటి గుడిగోపురాలు, విగ్రహాలు కలిగిన దేవాలయం ప్రత్యేకత సంతరించుకుందన్నారు. పిల్లలకు చారిత్రకమైన విషయాలు తెలియపరిచి తమ భవిష్యత్ తీర్చిదిద్దడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ప్రాచీన కాలంలోని మానవ జీవన విధానం నది పరీవాహక ప్రాంతంలోనే ఉన్నదని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న కృష్ణానది పరీవాహక ప్రాంతంలోనే మానవ పురోగతి జరిగి వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారని తెలిపారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా ఎంతో వైభవంగా ఉండేదని కాలక్రమంలో జిల్లా చరిత్ర మరుగున పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరుగున పడిన చరిత్రను వెలికి తీసి మళ్లీ పాలమూరు కళా ఖండాలను ప్రదర్శనల ద్వారా పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పురావస్తుశాఖకు అత్యంత ప్రాధాన్యతను కూడా ఇస్తుందని గతంలో ఈ శాఖ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయా ప్రాంతాలలోని చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడానికి పురావస్తుశాఖను బలోపేతం చేస్తున్నారని ఈ శాఖకు తాను మంత్రిగా కొనసాగడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పురావస్తుశాఖ సంచాలకులు దినకర్‌బాబు, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, పురావస్తుశాఖ జిల్లా అధికారులు నారాయణ, రాములునాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాదాఅమర్, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...పిల్లలమర్రిలో ప్రారంభించిన పురావస్తుశాఖ ప్రదర్శనశాలలో నంది విగ్రహాన్ని పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్