తెలంగాణ

పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయాస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, అధ్యక్షుడు పి గణపతిరెడ్డి కోరారు. కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత ఉన్న వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కార్మికుల వేతనాలు 8500 రూపాయిలు తగ్గకుండా చెల్లిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. 2018లో ఈ అంశంపై కార్మికులు సమ్మె చేస్తున్నపుడు వారందరికీ భరోసా ఇచ్చి సమ్మె విరమింపచేశారని, వేతనాలకు గ్యారంటీ ఇస్తామని చెప్పారని అయితే హామీ ఇచ్చి 11 నెలలు గడిచినా ఇంత వరకూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు జీవోలు మాత్రం జారీ కాలేదని అన్నారు. జీవోలను తక్షణం జారీ చేసి మాట నిలుపుకోవాలని పాలడుగు భాస్కర్ కోరారు.