తెలంగాణ

ఉద్యోగాల కోసం ప్రగతి భవన్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ల స్థానే విద్యావాలంటీర్లను నియమించాలని ఆదేశాలు ఇవ్వడంతో సర్వీసు కమిషన్ ద్వారా ఎంపికైన టీఆర్టీ అభ్యర్ధులు తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ గురువారం నాడు ప్రగతి భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన అభ్యర్ధులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఆర్టీ అభ్యర్ధులను అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. నెలల తరబడి ఎదురుచూస్తున్న టీఆర్టీ అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోగా, ఉద్యోగాలు అడిగితే వారిని అరెస్టు చేయడం దారుణమని వివిధ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. టీఆర్టీ అభ్యర్థులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం అప్రజాస్వామికమని టీటీఎఫ్ అధ్యక్షుడు ఈ రఘునందన్, ప్రధానకార్యదర్శి కే రమణ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించకపోగా, తమ సమస్యలను చెప్పుకుందామని వెళ్తే వారికి ముఖ్యమంత్రిని కలిసే అవగాశం ఇవ్వకపోగా, తిరిగి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. అభ్యర్ధుల ఆందోళనను అర్ధం చేసుకుని వారికి వెంటనే నియామకపత్రాలు జారీ చేయాలని కోరారు. 2017లో 8792 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, 2018 ఫిబ్రవరిలో టీఆర్టీ పరీక్ష నిర్వహించారని, 2018 జూన్‌లో మెరిట్ లిస్టును ప్రకటించారని, ఒక్కో పోస్టునకు ముగ్గురు అభ్యర్ధులను ఇంటర్వ్యూలకు పిలిచారని గుర్తుచేశారు. 2019 జనవరిలో స్కూల్ అసిస్టెంట్‌ల సెలక్షన్ లిస్టు పెట్టారని చెప్పారు. 2019 ఏప్రిల్‌లో ఎస్‌జీటీల ఎంపికకు లిస్టులు పెట్టారని ఇంత వరకూ పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదని ఆరోపించారు. ఎపుడు అడిగినా ఎంపిక జాబితాలు ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించామని, అవి ప్రస్తుతం ఆయన టేబుల్‌పై ఉన్నాయని చెబుతున్నారని ఇందులో ఎంత వరకూ వాస్తవం ఉందో ప్రభుత్వమే చెప్పాలని వారు పేర్కొన్నారు. ఇటీవల రెండు రోజుల పాటు సామూహిక దీక్షలు , జూన్ 8న ప్రగతి భవన్ ముట్టిడి కార్యక్రమాలను టీఆర్టీ అభ్యర్ధులు నిర్వహించారని, ఖాళీలలను విద్యావలంటీర్లతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో టీఆర్టీ అభ్యర్ధుల్లో ఆందోళన మొదలైందని అన్నారు.
అరెస్టులు అప్రజాస్వామికం: సీపీఎం
టీఆర్టీ అభ్యర్థుల అరెస్టులు అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి వెంటనే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆయన కోరారు.
ప్రభుత్వం వౌనం వీడాలి: యూటీఎఫ్
ఇప్పటికైనా ప్రభుత్వం వౌనం వీడాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సీహెచ్ రాములు, చావ రవి డిమాండ్ చేశారు. గత ఏడాదికాలంగా రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఎన్నో మార్లు అభ్యర్ధులు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని అన్నారు.