తెలంగాణ

3 కోట్ల 15 లక్షల గొర్రెలకు నట్టల మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ఈ నెల 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. సచివాలయం నుండి గురువారం ఆయన జిల్లా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా గుమ్మలూరు గ్రామంలో ఈ నెల 18 న ప్రారంభిస్తామన్నారు. 18 నుండి 25 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మొత్తం 3.25 కోట్ల గొర్రెలకు నట్టల మందు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారనా రు. ప్యారావెట్, గోపాల మిత్ర కర్యక్రమం ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంకోసం ప్రభుత్వం 22 కోట్ల రూపాయలు ఖర్తు చేస్తుందన్నారు. గోపాలమిత్రలకు 8,500 వేతనం చెల్లిస్తామన్నారు. నట్టల నివారణా కార్యక్రమం నూటికి నూరుశాతం విజయవంతం అయ్యేలా చూడాలని తలసాని తెలిపారు.