తెలంగాణ

ధాన్యం సేకరణ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్రం ధాన్యం సేకరిస్తున్న విధానాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రతినిధి టోనీ సంగనిరా ప్రశంసించారు. రైతుల నుండి పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరిస్తున్న విధానాన్ని సంగనీరా అడిగి తెలుసుకున్నారు. పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ అకున్‌సబర్వాల్‌తో సంగనీరా గురువారం సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు, ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం సాఫ్ట్‌వేర్ ద్వారా ధాన్యం సేకరణ, చెల్లింపు చేసే విధానం చాలా బాగా ఉందని ఆయన ప్రశసించారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని, రైతులకు చేయూత ఇస్తోందని దాంతో ఏటేటా ధాన్యం ఉత్పత్తి పెరిగిపోతోందని అకున్ సబర్వాల్ తెలిపారు.