తెలంగాణ

ఐటీ ప్రాజెక్టులపై బంగ్లా బృందం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ పౌరసరఫరాల శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అమలు తీరుతెన్నులపై బంగ్లాదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల బృందం అధ్యయనం చేసింది. 37 మందితో కూడిన బంగ్లాబంగ్లాదేశ్ అధికారుల బృందం గురువారం హైదరాబాద్ వచ్చింది. పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ అకున్ సబర్వాల్‌తో వీరు సమావేశమయ్యారు. పౌరఫరాల శాఖ చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, వేలిముద్రలతో రేషన్ పంపిణీ (ఈపాస్ విధానం), ఐరిస్ విధానం, టి-రేషన్ యాప్, పోర్టబిలిటీ, గోదాముల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, రేషన్ సరకులు తరలించే వాహనాలకు జీపీఎస్ వినియోగించడం, ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం పనితీరును బంగ్లా అధికారుల బృందం పరిశీలించింది. రేషన్ దుకాణాల్లో ఈపాస్, ఐరిస్ విధానం ద్వారా లబ్దిదారులు సరకులు తీసుకునే విధానాన్ని పరిశీలించారు. రేషన్ సరకుల పంపిణీ విధానం, దుకాణాల సంఖ్య తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాపంపిణీ విధానంలో 17,200 దుకాణాల ద్వారా 2.83 కోట్ల మందికి సరకులు ఇస్తున్నామన్నారు. ఒక్కో వ్యక్తికి కిలో ఒక రూపాయి ధరకే నెలకు ఆరుకిలోల బియ్యం ఇస్తున్నామన్నారు. మొత్తం 1.75 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా వందశాతం కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశామన్నారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ అమలు చేస్తున్న విధానం పట్ల బంగ్లాదేశ్ అధికారుల బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.