తెలంగాణ

ఏపీ సీఎం జగన్ దేశానికే ఓ రోల్ మోడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వయస్సులో చిన్నవాడైనా ప్రజాజీవితంలో దేశానికి ఓ రోల్ మోడల్ అని, తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్‌ను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని చూసైనా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేర్చుకోవాలని హితవు పలికారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను తెలంగాణకు స్వాగతిస్తున్న కేసీఆర్ పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించాలని అన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం బలమైనదైతే నష్టపోయేది పాలకపక్షమేనని, అందుకే ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు కుట్రపూరిత రాజకీయాలకు సీఎం కేసిఆర్ తెరతీస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో గడచిన ఐదేళ్లలో విద్యావ్యవస్థను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విద్యాహక్కు అమలు చేయడం లేదని తెలిపారు. ఏపీలో విద్యాహక్కు చట్టం అమలు చేయడంతో పాటు పిల్లలను బడికి పంపించే తల్లుల అకౌంట్లలో రూ.15 వేల డబ్బులు వేయాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. వయస్సులో చిన్నవాడైనా, పాలనలో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలోనే ఓ రోల్ మోడల్‌గా నిలువబోతున్నాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో అమలవుతున్న వాటిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ అమలు చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్‌మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వాటిని ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తే తప్పేంటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేని ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మాత్రమేనని గుర్తు చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చేందుకు ఆలోచించే బదులు ప్రజాసంక్షేమం గూర్చి ఆలోచిస్తే బాగుంటుందని సీఏం కేసిఆర్‌కు జీవన్ రెడ్డి హితవు పలికారు. అధికార పార్టీ ప్రలోభాలకు, తమ సొంత ప్రయోజనాలకు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండడం విచారకరమని, తమపై అపారమైన నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయం హర్షనీయమని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించేందుకు చిన్నవాడైనా జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు జీవన్ రెడ్డి హితవు పలికారు.