తెలంగాణ

ఇంకా ఎందుకు నీరివ్వరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, జూన్ 14: అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కలల స్వప్నం మిషన్‌భగీరథ పథకం నీరుగారి పోతోందంటూ శుక్రవారం అగ్రహారంలోని వాటర్ గ్రిడ్ వద్ద కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. అంతకుముందు ఆయన వాటర్ గ్రిడ్‌ను పరిశీలించారు. శాసనసభ ఎన్నికల ముందు నాటికే మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాల్సిన అధికారులు నత్తనడకన పనులు చేస్తుండటంతో పూర్తి కాలేదని ఇప్పటివరకు ఎన్ని రివ్యూ మీటింగ్‌లు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సకాలంలో చేరాల్సిన మంచి నీరును ఇలా అధికారులు నిర్లక్ష్య వైఖరితో సరఫరా చేయకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎస్సారెస్పీ ద్వారా మిడ్‌మానేరులోకి వచ్చిన నీటిని అగ్రహారం వాటర్ గ్రిడ్‌లో పూర్తిగా శుద్ధి జరిగి నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయిన్‌పల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాలకు ఇప్పటికే మంచినీరు అందాలని, రోజుకు 22 గంటలు ఇక్కడి నీటి శుద్ధి జరుగుతోంది కాని చొప్పదండికి మాత్రం నీరు రావటం లేదని అన్నారు. 84 ఎంఎల్ నీరు ఇక్కడి శుద్ధి జరుగుతున్నా ఎందుకు మా ప్రాంతానికి నీరు ఇవ్వడం లేదంటూ అధికారుల తీరుపై మండిపడుతు కాంట్రాక్టర్లు ఎందుకు త్వరితగతిన పని పూర్తి చేయటం లేదంటూ నిలదీసారు. ఎప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసిన అధికారులు మాత్రం దాటవేస్తూ వస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ మొండిపట్టు పట్టారు. వారం రోజుల్లో నీరు అందించాలని డిమాండ్ చేశారు. కదలకుండా అక్కడే నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో నిరసన చేపట్టడంతో స్పందించిన అధికారులు ఈనెల 28 నాటికి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. అప్పటివరకు ఇవ్వని పక్షంలో స్వయాన తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ అనిల్, మాజీ ఎంపీపీ దూలం బాలాగౌడ్, పొనుగోటి క్రిష్ణారావు, మార్కొండ కిష్టారెడ్డి, మేచినేని రాజేందర్ రావు, ఆకుల మధుసుసూదన్, ఆరెల్లి చంద్రశేఖర్, మాచర్ల వినయ్‌కుమార్‌తో పాటు పలువురు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.