తెలంగాణ

పోలీస్ నియామకాలకు దళారులను నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 14: పోలీస్ నియామకాల్లో అభ్యర్థులు దళారులు, బ్రోకర్లను నమ్మి మోసపోవద్ధని జిల్లా ఎస్పీ ఏవీ.రంగనాథ్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగ రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ఒరిజినల్ సర్ట్ఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభ్యర్థులకు ఎవైనా ఇబ్బందులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు. పోలీస్ నియామక మండలి నిబంధనలు, ఆదేశాలకు అనుగుణంగా సర్ట్ఫికెట్ల పరిశీలన సాగుతుందన్నారు. అభ్యర్థులంతా నిబంధనల మేరకు, అధికారులు సూచించినట్లుగా తమ ఒరిజినల్ సర్ట్ఫికెట్లతో వచ్చి వెరిఫికేషన్‌కు హాజరుకావాలన్నారు. ఎవరైనా ఒరిజినల్ సర్ట్ఫికెట్లు తీసుకరాని పక్షంలో అధికారుల నుండి తగిన సమయం తీసుకుని తెచ్చుకోవాలని సూచించారు. సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా 20 కౌంటర్లను ఏర్పాటు చేశామని, ప్రతి రోజు 1,000 మంది అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుందని, మొత్తం ఎనిమిది రోజుల పాటు 8,333 మంది అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి డీఎస్పీ గుజ్జ రమేష్, దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్, డీపీవో నాగరాజన్, సూపరిండెంట్లు రెహమాన్, దయాకర్, ఆర్‌ఐలు పాల్గొన్నారు.