తెలంగాణ

ఏజెన్సీలో మావోల కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం(నూగూరు)/వాజేడు, జూన్ 15: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం సర్కిల్లో వెంకటాపురం, వాజేడు మండలాల నూతన కమిటీ పేరుతో కరపత్రాలు దర్శనం ఇవ్వడంతో ప్రజలు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ధం క్రితం వెంకటాపురం ఏరియా కమిటి పేరుతో మావోయిస్టులు కార్యకలపాలు నిర్వహించేవారు. అనంతరం పరిణామాలతో చర్ల, శబరి, బస్తర్ కమిటీల పేరుతో వెంకటాపురం సర్కిల్లో కార్యకలపాలు నిర్వహించేవారు. సరిహద్దు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండడంతో తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ పోలీసులు ఉమ్మడిగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో మావోల కార్యకలపాలకు తాత్కలికంగా బ్రేకులు పడగా ఆకూ రాల్చే కాలం పోయి అడువులు చిగిస్తుండడంతో తిరిగి ఈ ప్రాంతంలో వెంకటాపురం, వాజేడు కమిటి పేరుతో ప్రత్యేకంగా కార్యకలపాలు నిర్వహించాలని కర పత్రాలు వెదజల్లడంతో బహర్గతం అయ్యింది. జల్ జంగల్ జమిన్ పేరుతో తిరిగి ఏజెన్సీ ప్రాంతంలో పగా వేసేందుకు మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు పోలీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నూతన పథంలో మావోయిస్టులు కార్యాకలపాలు నిర్వహిస్తారనే ఇంటల్‌జెన్సీ సమాచారంతో పోలీసులు ఆ దిశగా మావోయిస్టు కార్యాకలపాలకును తిప్పికోట్టేందుకు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో వాజేడు మండల వ్యాప్తంగా ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.