తెలంగాణ

యాదాద్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 15: మూడు మాసాల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం నిర్మాణ పనులతో పాటు శివాలయం నిర్మాణ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి అధికారులను, స్థపతులను ఆదేశించారు. శనివారం ఆయన యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి నూతన ఆలయాల పనుల పురోగతిని రెండు గంటల పాటు నిశితంగా పరిశీలించి అనంతరం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో, స్థపతులు, అర్కిటెక్ట్‌లతో సమీక్షించారు. ఆలయాల నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యతలో రాజీ పడకూడదని, సీఎం కేసీఆర్ సూచనల మేరకు పనులు వేగంగా సాగాలన్నారు. అద్భుత శిల్పకళతో యాదాద్రి నూతన ఆలయం నిర్మాణం జరుగాలని సీఎం కేసీఆర్ ధృడ సంకల్పంతో ఉన్నారన్నారు. అదే సమయంలో నూతన ఆలయంతో పాటు కొండపైన ఇతర అభివృద్ధి పనుల నిర్మాణాలు, దిగువన ఆలయ నగరి, పెద్దగుట్టపై కాటేజీలు, ప్రెసిడెన్షియల్స్ సూట్‌ల నిర్మాణ పనులను, పరిసర చెరువుల సుందరీకరణ, కొండ చుట్టు గిరి ప్రదక్షిణ దారులతో పాటు గుట్టకు నలువైపుల విస్తరణలో ఉన్న రహదారుల నిర్మాణ పనులు, విద్యుత్, ఆర్టీసీ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని పనులన్నింటిని సమాంతరంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి పట్టణం చుట్టు రింగ్ రోడ్డు నిర్మాణం పనులను సైతం త్వరితగతిన చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఈవో గీతా, స్థపతులు వేలు, అర్కిటెక్ట్ ఆనందసాయితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిత్రం... యాదాద్రి నూతన ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తున్న సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి