తెలంగాణ

రోడ్ల భద్రతపై అవగాహన పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: రోడ్ల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం సచివాలయం రోడ్డు సేప్టీకౌన్సిల్ సమావేశాన్ని మంత్రి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారుల నుద్దేశించి మాట్లాడుతూ రోడ్డు భద్రతపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్డు సేప్టీకౌన్సిల్ సమావేశంలో పలు విషయాలను అధికారులకు మంత్రి సూచించారు. రోడ్డు భద్రత ప్రభుత్వానిదే కాకుండా ప్రజలు కూడా వ్యక్తిగతంగా రోడ్లభద్రతపై అవగాహనతో పాటు రక్షణకు సంబంధించి తగుజాగ్రతలు తీసుకోవాల్సిన చర్యలను అధికారులు గుర్తు చేయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విలువైన సూచనలు వచ్చాయన్నారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. జాతీయ రహదార్లపై రోడ్డు స్పాట్స్‌ను గుర్తించి జాతీయ రహదార్లను రోడ్డు భద్రతపై విషయంలో ఏ, బీ, సీ కేటగిరిలుగా విభజించాలన్నారు. ప్రతి ఇరవై కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను ఎంత సమయంలో ఆసుపత్రికి చేర్చుతామో చెప్పే సూచనలు ఉండాలన్నారు. రహదార్లపై నడిచే అన్ని వాహనాలను ఖచ్చితంగా తనిఖీలు చేయాలన్నారు.