తెలంగాణ

‘మల్లన్నసాగర్’ తరహాలోనే న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 15: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శివన్నగూడెం(చర్లగూడెం), కిష్టరాంపల్లి రిజర్వాయర్‌ల కింద భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసిత గ్రామాల రైతులు, ప్రజలు శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సారధ్యంలో నల్లగొండ కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళన నిర్వహించారు. నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకపల్లి, లక్ష్మణాపురం గ్రామాలకు చెందిన నిర్వాసితులు రాజగోపాల్‌రెడ్డి సారథ్యంలో నల్లగొండకు చేరుకుని గడియారం సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని నిలువరించి లోనికి దూసుకెళ్లకుండా అదుపు చేశారు. నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి అంతకుముందు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఇచ్చిన హామీ మేరకు ఆయన కలెక్టరేట్‌లో నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలను విన్నారు. నిర్వాసితులంతా తమకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు తరహాలోనే ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, ఎకరానికి రూ. 10లక్షల పరిహారం చెల్లించాలని కలెక్టర్‌కు తమ డిమాండ్లు వినిపించారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, మల్లన్న సాగర్ తరహాలో తమకు ముందుగా పరిహార, పునరావాసా చర్యలు చేపట్టిన పిదపనే రిజర్వాయర్‌ల పనులు కొనసాగించాలని కోరుతున్నామన్నారు. పరిహారం కోసం ఆందోళన చేసిన తమపై పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ముంపు భూములు, ఇళ్లకు సంబంధించిన సర్వే సక్రమంగా నిర్వహించలేదని మళ్లీ సర్వే జరిపించాలని కలెక్టర్‌కు నివేదించారు. నిర్వాసితుల సమస్యలపై స్పందించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వారి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించి పరిహారం పెంపు, ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కోరారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద నిర్వాసితులకు రూ.11లక్షలు చెల్లిస్తున్నారని, డిండి నిర్వాసితులకు కనీసం రూ.10లక్షలైనా ఇవ్వాలని కోరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ తీసుకుని చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను ఆయనకు నివేదిస్తామన్నారు. ప్రాజెక్టుకు అంతా సహకరిస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, ఇందుకు ప్రభుత్వం వైపు నుండి చొరవ అవసరమన్నారు. పోలీసులను పెట్టి రిజర్వాయర్‌ల పనులు జరిపిస్తు నిర్వాసితులను బెదిరించేలా వ్యవహారించడం సరికాదన్నారు. నిర్వాసిత నాలుగు గ్రామాల ముఖ్యులతో గురువారం సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాఛరణపై చర్చిస్తామన్నారు. నిర్వాసితుల డిమాండ్లు నెరవేరే వరకు తాను వారికి అండగా పోరాడుతానన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ ఎ.వి.రంగనాథ్, జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్‌తో పాటు నిర్వాసిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.