తెలంగాణ

43 శాతం ఐఆర్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని, 2019 జనవరి 1 వరకు బకాయి ఉన్న డీఏ చెల్లించాలని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, టీచర్లు, పింఛనర్లు, వర్కర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. జేఏసి సమావేశం శనివారం ఇక్కడ నిర్వహించారు. సమావేశంలో చేసిన తీర్మానాలను జేఏసీ చైర్మన్ కె. రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.మమత శనివారం సాయంత్రం ఇక్కడ విడుదల చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెగ్యులర్ కాని ఇతర ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లకు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, భాషా పండితులు, పీఈటీల ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంస్థల టీచర్లకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జూన్/జూలై నెలల్లో సాధారణ బదిలీలు చేయాలని కోరారు. ప్రమోషన్ల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించాలని, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ తిరిగి రప్పించాలని జేఏసీ కోరింది.