తెలంగాణ

లిస్బన్ క్లబ్ ఘటనపై డీజీపీ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్ లిస్బన్ క్లబ్‌లో డ్యాన్సర్ మహిళపై దాడి జరిగిన ఘటనపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్‌లో మహిళలు అదృశ్యంపై సామాజిక మాధ్యమాలతో పాటు షోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పోలీసులను కలవరపెడుతున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా లిస్బన్ క్లబ్ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా సహాయం చేయకపోగా ఆమెపై దురుసుగా ప్రవర్తించిన పోలీసుల ఘటన నగరవాసులను విస్మయం కల్గిస్తోంది. లిస్బన్ క్లబ్ ఘటన ఆదివారం ప్రచార మాధ్యమాల్లో ప్రముఖంగా రావడంతో రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ మహేందర్‌రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లు తెల్సింది. గత వారం రోజులుగా హైదరాబాద్‌దో పాటు తెలంగాణ జిల్లాల్లో మహిళలు అదృశ్యం అవుతున్నారని సామాజిక మాధ్యమాలు, షోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలో ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానకి పంజాగట్ట పోలీస్ స్టేషకు వెళితే అక్కడ తనకు అవమానం జరిగిందని చెప్పడం పట్ల పోలీసులు అధికారులు తీవ్రంగా పరిగణించారు. లిస్బన్ క్లబ్‌లో డ్యాన్స్‌ర్‌గా పని చేస్తున్న హరణి అనే యువతిని అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం, అందుకు ఆ యువతి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహింతగా తోటి డ్యాన్సర్లతో పాటు దళారి సరుూద్ దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన మహిళ జూనియర్ ఆర్టిస్టుగా స్థిరపడేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. సినీరంగంలోఅవకాశాలు లేకపోవడంతో కుటుంబాన్ని పోషంచడానికి లిస్బన్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తున్నారు. క్లబ్‌కు వచ్చే వినియోగదారులను మెప్పించడానికి వారితో చనువుగా ఉండాలని తోటి డ్యాన్సర్లతో పాటు దళారి సరుూద్ ఆమెపై వత్తిడి చేశారు. అయితే అందుకు అంగీకరించకపోవడంతో తనను తీవ్రంగా హింసించడం జరిగిందని ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లబ్‌కు వచ్చిన పోలీసులు ఆమె ఫిర్యాదును పరిశీలించకుండా తనపై దాడిచేసిన వారికే వత్తాసుపలికారని ఆరోపించిన సంగతి తెల్సిందే. సీనియర్ పోలీస్ అధికారులు రంగప్రవేశం చేయడంతో ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు నలుగురు డ్యాన్స్‌ర్లను అదుపులోకి తీసుకున్నారు. దళారి సరుూద్, మరో డ్యాన్సర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పంజాగుట్ట పోలీసులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని, ఆరోపణలు రుజువైతే.. సంబంధిత పోలీస్ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.