తెలంగాణ

పార్లమెంట్‌లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: పార్లమెంట్‌లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం తీసుకువచ్చే విధంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బీసీ నేత ఆర్ కృష్ణయ్య సూచించారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కిషన్‌రెడ్డిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి 14 అంశాలకు సంబంధించిన వినితిపత్రాన్ని అందించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. విద్య, ఉద్యోగాలపై ఉన్న క్రిమీలేయర్‌ను తొలగించాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను వంద శాతం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలను కేటాయించాలన్నారు. బీసీలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లను అమలుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కోరారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 52 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.