తెలంగాణ

ట్రాఫిక్‌పై ప్రజల్లో అవగాహన పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: రోడ్ల భద్రతపై వాహనదారులకు అవగాహన పెంచడం వల్ల ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చునని రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం రోడ్ల ప్రమాదాలపై నెక్లెస్ రోడ్డులో స్కూల్ విద్యార్థలు 2కే వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ రోడ్ల ప్రమాదాలను నివారించడానికి రోడ్ల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహనదార్లు తప్పనిసరిగా హెల్మెట్‌లను ఉపయోగించుకోవాలన్నారు. రహదార్ల కూడళ్ల వద్ద సిగ్నల్స్‌ను అనుసరించి వాహనదార్లు రోడ్లను దాటాలన్నారు. పాదచార్లు ఫుట్‌పాత్‌లపై నడవాలన్నారు. రహదార్లపై స్పీడ్‌బ్రేకర్ల వద్ద వాహనాదార్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగర, పట్టణాల్లో స్కూల్ జోన్ల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్ పిల్లలకు అవగాహన పెంచడానికి స్కూల్ పరిధిలోట్రాఫిక్ నిబంధనల అంశాలను తెలియచేసే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 1970 సంవత్సరం నుంచి ఏటా ప్రమాదాలను పరిశీలిస్తే అప్పట్లో రోజూ 15వేల మంది రోడ్ల ప్రమాదాల్లో మృతి చెందేవారన్నారు. 2019 నాటికి ప్రమాదాలను పరిశీలిస్తే రోజూ 1.5 లక్షల మంది రోడ్ల ప్రమాదాల్లో మృతి చెందడం ఆందోళన కల్గిస్తోందన్నారు. జరుగుతున్న ప్రమాదాల ఘటనలకు ప్రధాన కారణం రోడ్ల భద్రతపై అవగాహన లేకపోవడమే ప్రధానాంశం అన్నారు. రోడ్ల ప్రమాదాలను కనిష్టస్థాయికి తీసుకురావడానికి ప్రజల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతీయ రహదార్లపై ప్రతి వంద కిలోమీటర్లకు భద్రతకు సంబంధించిన వివరాలతో బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల జరిగినప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చడానికి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. జాతీయ రహదార్లపై పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతుంటే వాహనదార్లకు హెచ్చరికగా ఉంటుందన్నారు. రోడ్ల ప్రమాదాలపై టాటా (ట్రాఫిక్‌పై అవగాహన పెంచుకుంటే రోడ్ల ప్రమాదాలను నివారించవచ్చు) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం విద్యార్థులతో 2కే వాక్ నిర్వహించామని ఆ సంస్థ డాక్టర్ శరత్ చంద్రవౌలి తెలిపారు. 2కే వాక్‌లో పాల్గొన్న విద్యార్థులతో మంత్రి కూడా వాక్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోఫెసర్ పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు, కిమ్స్ సీఈవో కిషోర్, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో రఘుప్రసాద్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ పూర్ణిమా ఎ నాగరాజు పాల్గొన్నారు.

చిత్రం...రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులో
జరిగిన 2కే వాక్‌లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి