తెలంగాణ

ఒక నాటకం.. ఒక నాటిక.. పాతిక అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూన్ 17: ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ శివసత్తుల జీవితం నేపథ్యంతో తెగారం నాటకం అవార్డుల పంట పండిస్తోంది.
నిన్న తెనాలిలో జరిగిన పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్ వారి జాతీయ నాటిక పోటీల్లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొంది. అగ్రస్థానంలో నిలిచి గతంలో ఈ నాటకం పంతం పద్మనాభ నాటక పోటీల్లో ప్రదర్శించడంతో ఆరు అవార్డులను, రవీంద్రభారతిలో జరిగిన పరుచూరి పోటీలలో మరో ఆరు అవార్డులను గెలుచుకొంది. ఒక నంది అవార్డును గుంటూరులో జరిగిన నాటక పోటీలో గెలుచుకోగా, మరో రెండు అవార్డులను గెలుచుకొంది. అంతేగాకుండా ఈనెల 19న జరిగే ప్రతిష్టాత్మక శ్రీమతి శకుంతల స్మారక నాటక పురస్కారానికి తెగారం ఎంపికైంది. రచయిత పెద్దింటి అశోక్‌కుమార్, రవీంద్రభారతి వేదికపై అవార్డు అందుకొనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించి, పలువురి ప్రశంసలు పొందుతున్న ఈ నాటకానికి డా.మల్లేశ్ బలాస్టు దర్శకత్వం వహించగా, నిజామాబాద్‌కు చెందిన జాబిల్లి కల్చర్ కళాసమితి సమర్పించారు. తెలంగాణ నుండి మంచి నాటికలు రావడం హర్షణీయమని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అభినందించారు.

చిత్రం...‘తెగారం’ నాటిక దృశ్యం