తెలంగాణ

విద్యార్థి లోకానికి కుశ్వంత్ ఆదర్శం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జూన్ 17: విద్యార్థిలోకానికి కుశ్వంత్ ఆదర్శం కావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఎంపటి కుశ్వంత్ అతని తల్లి అనితలను వారు సన్మానించారు. ఈ సందర్భంగా కుశ్వంత్ ఉన్నత చదువుల కోసం జీఎంఆర్ ట్రస్టు ద్వారా రూ.లక్ష నగదును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదరికం నుండి వచ్చిన కుశ్వంత్ తల్లి అనిత చేయూతతో రాష్ట్ర స్థాయిలో ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించడంతో పాటు నీట్‌లో జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌లో 8వ ర్యాంక్ సాధించడం గొప్ప విషయమన్నారు. అలాగే గత వారం విడుదలైన ఎయిమ్స్ ఎంట్రెన్స్ ఫలితాల్లో 19వ ర్యాంక్ సాధించి భూపాలపల్లి జిల్లాకు గుర్తింపు తెచ్చాడని అన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన కుశ్వంత్‌కు జీఎంఆర్ ట్రస్టు లక్ష రూపాయలను అందించిందన్నారు. రాబోయే రోజుల్లో కుశ్వంత్ కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వం నుండి కూడా సాయం అందించేందుకు తమవంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంబీబీఎస్ చదువు కోసం కూడా అండగా ఉంటామన్నారు. కుశ్వంత్ విద్యార్థి లోకానికి ఆదర్శమయ్యాడని అభినందనలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో 10వ తరగతిలో మొదటి, తృతీయ స్థానాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఇప్పటి నుంచి మండల కేంద్రాల్లో జీఎంఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కుశ్వంత్ మాట్లాడుతూ తన పరిస్థితిని వివరిస్తూ ‘ఆంధ్రభూమి’లో కథనాలు ప్రచురించడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని అన్నారు.

చిత్రం...కుశ్వంత్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి