తెలంగాణ

త్వరలోనే 4వేల గృహాల కాలనీ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, జూన్ 17: స్థానికంగా ఉండే రామస్వామి గుట్ట వద్ద ఉన్న గృహాల కాలనీని త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో వారం రోజుల్లో స్థానిక రామస్వామి గుట్ట వద్ద గల నాలుగు వేల గృహాలపై ప్రభుత్వం తేల్చకుంటే నిరసన దీక్ష చేస్తానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించడంతో జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి వర్షంలో కూడా రామస్వామి గుట్ట వద్దకు వెళ్లి గృహల కాలనీ సందర్శించి త్వరలో పూర్తి చేయిస్తానని ప్రకటించారు. వెంటనే గృహనిర్మాణ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కాగా, హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో బీసీ గురుకుల పాఠశాలను జగదీశ్వర్‌రెడ్డి సోమవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఉచిత విద్య అందించే కార్యక్రమంలో భాగంగా 119 నియోజకవర్గాలలో 119 బీసీ గరుకుల పాఠశాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు అమయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాసు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...హుజూర్‌నగర్‌లో బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభిస్తున్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి