తెలంగాణ

వైద్యుల సమ్మెకు ఒకరి బలి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 17: ఇండియన్ మెడికల్ అసొసియేషన్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సోమవారం సమ్మె నిర్వహించడం రోగులకు ప్రాణ సంకటమైంది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏకంగా ఓ రోగికి సకాలంలో ఆక్సిజన్, వైద్య చికిత్స అందక మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదానికి గురి చేసింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు కనగల్ మండలం ఎం.గౌరారానికి చెందిన అనబీమన నరసింహచారి(65) తీవ్ర దమ్ము, ఆయాసంతో సోమవారం ఉదయం ఆసుపత్రిలో చేరాడు. కొన్ని గంటల్లోనే అతడి ఆరోగ్యం విషమించగా చికిత్స అందించాల్సిన వైద్యులు సమ్మెలో ఉండటం, పట్టణంలోని ఇతర ఆసుపత్రుల్లో సైతం సమ్మె సాగుతుండటంతో సకాలంలో అతడికి చికిత్స కరవైంది. వెంట ఉన్న కుటుంబ సభ్యులు ఉరుకులు పరుగులుగా సమ్మెలో ఉన్న ఆసుపత్రి వైద్యుల వద్దకు వెళ్లి బతిమాలాడుకున్నారు. సిబ్బందికి ఆక్సిజన్ పెట్టాలని, పలు పరీక్షలు జరిపించాలని వైద్యులు సూచించారు. సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్ పెట్టేందుకు విఫలయత్నం చేయగా అప్పటికే ఆలస్యమవ్వడంతో నరసింహచారి ప్రాణాలొదిలాడు. సమ్మె వల్ల ఇటు ప్రభుత్వ వైద్యులు సకాలంలో చికిత్స అందించక, అటు ప్రైవేటు వైద్యులంతా సమ్మెలో ఉండటంతో వైద్య వసతి కరవై నరసింహచారి ప్రాణం పోయిందంటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. జిల్లా కేంద్రం ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల సమ్మెతో అవుట్ పేషంట్ విభాగంలో రోగులు, గర్భిణీలు, బాలింతలు గంటల తరబడి నానా ఆవస్థలు పడుతు వైద్యుల కోసం నిరీక్షించారు.
మృతికి సమ్మె కారణం కాదు
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగి నరసింహచారి మృతికి వైద్యుల సమ్మె, ఆక్సిజన్ సిలిండర్ కొరత ఎంతమాత్రం కారణం కాదని సూపరిండెంట్ నర్సింగ్‌రావు తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నరసింహచారి ఆరోగ్యం వేగంగా విషమించి వైద్యులు పరీక్షించి చికిత్స అందించే క్రమంలోనే మృతి చెందాడన్నారు. అతడి మృతికి ఆసుపత్రి వైద్యుల లోపం కారణమంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆసుపత్రిలో వైద్యులు సమ్మె చేయలేదని, కేవలం కొన్ని నిమిషాల పాటు సంఘీభావ ప్రదర్శనలో మాత్రమే పాల్గొన్నారని, ఓపి, ఇతర వైద్యసేవలన్నింటినీ కొనసాగించారని తెలిపారు.

చిత్రాలు.. సకాలంలో వైద్యం అందక మృతి చెందిన నరసింహచారి, రోదిస్తున్న కుటుంబ సభ్యులు