తెలంగాణ

అవినీతిలో కూరుకున్న పార్టీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: అవినీతిలో కూరుకుపోయిన పార్టీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర పశుసంవర్థకశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. భట్టివిక్రమార్క తనకు మించిన మేథావి ప్రపంచంలోనే లేరని అనుకుంటున్నారని, గాంధీ భవన్‌లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దేశం అంతా గర్వపడుతోందని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తట్టెడు మట్టి కూడా తీయలేద న్నారు. అతితక్కువ సమయంలో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం అని తెలీదా అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఇంజనీర్‌లా కష్టపడి ప్రాజెక్టు పూర్తికి ఎంతో శ్రమతీసుకున్నారని అన్నారు. సీఎల్‌పీ నేతగా భట్టివిక్రమార్కను ఎన్నుకోవడం ఆ పార్టీ నేతలకు కూడా ఇష్టం లేదని అన్నారు. సీఎల్పీ నేతగా ఎన్నుకోగానే పార్టీ నేతలకు కన్నుకుట్టిందని, రాహుల్‌గాంధీ చెప్పారని దీక్షకు కూర్చున్నట్టు భట్టి చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ నేతలే అంటున్నారని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి మాటలను ప్రస్తావిస్తూ, ఆయన మాటలు వింటుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వ లోపం ఏమిటో తెలుస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం ఏదో గాంధీ భవన్‌లోనే పుట్టినట్టు మాట్లాడుతున్నార ని కాంగ్రెస్‌లో నాయకత్వం చాలా వీక్‌గా ఉందని అన్నారు. అందుకే ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. కరెంట్ ఇస్తే జానారెడ్డి తమ పార్టీలో చేరుతామని ఆనాడు చెప్పారని, ఇపుడు తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరా అవుతోందన్నారు. కానీ టీఆర్‌ఎస్‌లో చేరకుండానే ఓడిపోయారని అన్నా రు. తెలంగాణలో ఏర్పాటు చేసినన్ని గురుకులాలు ఎక్కడా లేవని, వాటి గురించి ఎన్నడైనా కాంగ్రెస్ నేతలు ఆలోచించారా అని ప్రశ్నించారు. ఈ రోజున లక్ష మంది విద్యార్థు లు గురుకులాల్లో చదవుతున్నారని చెప్పారు. నాలుగు పార్లమెంటు సీట్లు గెలిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎగిసి పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ చెప్పలేదని, ఫెడరల్ ఫ్రంట్ కోసం కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలని ఎన్నడూ అనలేదని అన్నారు. దేశంలోని కనీస వనరులను, నీటిని వాడుకోవాలని అందుకు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని కేసీఆర్ చెప్పారని అన్నారు. తమ పార్టీ నుండి సస్పెండ్ చేసిన కార్పొరేటర్‌ను బీజేపీలో చేర్చుకుని గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండాకే అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డా అని కిషన్ రెడ్డి అనడం సరికాదని పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని తక్కువ చేసి మాట్లాడారని అన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలని కేసీఆర్ అనుకోవడం తప్పా అని నిలదీశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రా ముఖ్యమంత్రిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించారని అన్నారు. ప్రతిపక్షాల మైండ్ సెట్ మారితే వారిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు.