తెలంగాణ

అలా చెప్పుకోవడం బీజేపీకి సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: ఇతర పార్టీల నుండి నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని పదే పదే బీజేపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రోజూ వంద మంది తమతో టచ్‌లో ఉంటున్నారని నిస్సగ్గుగా పార్టీ ఫిరాయింపులను బీజేపీ నేతలు ప్రోత్సహించడం దారుణమని ప్రభాకర్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ప్రకటనలపై ఆయన మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో సహా నాయకులు అంతా ఓడిపోయారని, ఒక్కరు మాత్రమే గెలిచారని అలాంటి పార్టీ ఏదో అనుకోకుండా నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే వీరవిహారం చేస్తోందని అన్నారు. 103 అసెంబ్లీ స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా సాధించలేని బీజేపీని రాష్ట్రంలో రాజకీయ శక్తి కాలేదని అన్నారు. కాంగ్రెస్‌ను కుట్రతో ఓడించి అన్ని రకాలుగా దుర్వినియోగానికి పాల్పడిన బీజేపీ ఇపుడు రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని అన్నారు. లక్ష్మణ్‌కు వారి పార్టీ బలంపైన నమ్మకం ఉంటే పార్టీ మారిన వారిచేత రాజీనామాలు చేయించాలని అప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలుస్తుందని అన్నారు. పదవులు, డబ్బులు, అధికారం ఆశచూపి ఇతర పార్టీల నేతలను నాయకులను బీజేపీలో చేర్చుకోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రస్తుత నేతలకు బీజేపీని నడిపే సత్తాలేకనే ఇతర పార్టీల నేతలను స్వాగతిస్తున్నారని చెప్పారు. బీజేపీలో చేరుతున్నట్టు ఇప్పటికే కొన్ని పేర్లు వెలుగు చూశాయని వారంతా తాము పార్టీ మారడం లేదని బహిరంగ ప్రకటనలు చేయాలని అన్నారు.