తెలంగాణ

జాతీయ హోదా ఎందుకు కోరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ప్రధాన మంత్రిని సీఎం కేసీఆర్ ఎందుకు కోరలేదని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నిలదీశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి చేయడానకి నిధుల కోసం నీతి ఆయోగ్ సమావేశానికి ఎందుకు వెళ్ళలేదని ఆయన నిలదీశారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం విచారకరమన్నారు. ప్రాజెక్టులు తనవల్లే జరుగుతున్నాయని చెబుతున్న సీఎం కేసీఆర్ నీతి అయోగ్‌కు వెళ్ళి కాళేవ్వరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని ప్రధాన మంత్రికి వినతిపత్రం ఇచ్చి ఉంటే సమంజసంగా ఉండేదన్నారు. నీతి అయోగ్‌కు ఎందకు గైర్హాజర్ అయ్యారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 19న ప్రధాన మంత్రి అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు హాజరు అవుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం నిధుల వెచ్చింపుపై చర్చలు జరగనున్నాయన్నారు.