తెలంగాణ

జాతీయ హోదాకు అడ్డంకులు సరికావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 18: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే వరప్రదాయని అని, అంతటి విశిష్టతగల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా రూపాంతరం చెందుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించడం సరికాదని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ సీఈ వెంకట రామారావు, చంద్రవౌళి, బీమయ్య, జానార్థన్ మాట్లాడారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన 64శాతం పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు సూర్యపేట కోదాడ వరకు నీళ్లు అందిస్తున్నామని, ఇక కాకతీయ కెనాల్ ఎస్‌ఆర్‌ఎస్పీ మొదట స్టేజ్ రెండుకు నీళ్లదిస్తున్నట్టు చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ద్వారా మునుముందు తెలంగాణ నీటి కష్టాలు ఉండవని తెలిపారు. ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం లేదని మాట్లాడటం ఎంతో ఆవేదన కలిగిస్తుందని అన్నారు. యావత్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రికార్డు సమయంలో నిర్మించిన ప్రాజెక్టులో తప్పులు వెతకడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.