తెలంగాణ

కాళేశ్వరంలో శరవేగంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జూన్ 18: ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. 21వ తేదీన ఇద్దరు గవర్నర్లు, ముగ్గురు ముఖ్యమంత్రులు వస్తుండటంతో అధికార యంత్రాంగం మొత్తం కాళేశ్వరంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా, రాష్టస్థ్రాయి పోలీసు యంత్రాంగమంతా దృష్టి కాళేశ్వరంపై పెట్టారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న పైలాన్, యాగ శాల నిర్మాణం, ముఖ్యమంత్రి సభావేదిక పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని మేడిగడ్డకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. తేదీ ప్రకటించిన నాటి నుండే కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్.్భస్కరన్, కాటారం ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్యలు కాళేశ్వరంపైనే దృష్టి సారించి హెలీప్యాడ్ స్థలాలతో పాటు ముఖ్య అతిథులు బసచేసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎప్పుడూ లేనివిధంగా వీఐపీల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులకు, అధికారులకు బందోబస్తు ఏర్పాట్లు సవాల్‌గా మారుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో మూడు సార్లు ముఖ్యమంత్రి రావడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు రావడం ఈ సారి అందరి దృష్టి కాళేశ్వరంపై పడింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉండటంతో రాత్రింబవళ్లు అధికారులు ప్రాజెక్టు సమీపంలోనే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. దేశం మొత్తం ఎదురు చూసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.