తెలంగాణ

చేనేత సమస్యల పరిష్కారానికి సమష్టి ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 18: చేనేతకారుల సమస్యల పరిష్కారానికి సమష్టి ఉద్యమాలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దాసు సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టీడీపీ అధికార ప్రతినిధి చిలువేరు కాశీనాథ్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం చేనేత విభాగం నాయకులు మురళి, పద్మశాలి పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ రాజు, కూరపాటి రమేష్ బీసీ సంఘం నాయకులు కోలా జనార్దన్, గుజ్జ కృష్ణ పాల్గొని మాట్లాడారు. చేనేతను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న నేతకారులు సైతం ఇక్కడి వచ్చి ఉద్యమాలు సాగించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించిన చేనేతకారులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత మన సంస్కృతిలో భాగమనే విషయాన్ని పాలకులు మరిచారని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం అక్కడి సాంప్రదాయ చేతి వృత్తులను రక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. నేతకారుల సమస్యలను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటిస్తున్న పాలకులు అంతంత మాత్రంగానే నిధులను విడుదల చేస్తున్నారని విమర్శించారు. నాగరికతకు నాంది పలికిన చేనేత కుటుంబాలు దినదినగండ జీవితాలను వెల్లదీయడం బాధాకరమని చెప్పారు. వస్తు ఉత్పత్తి చేస్తున్న కులాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమిస్తే మరింత లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించ తలపెట్టిన నేతన్నల సమరనాదం ఛలో దిల్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.