తెలంగాణ

పీజీఈసెట్‌లో 15,644 మందికి అర్హత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సులు ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన పీజీఈసెట్‌లో 15,644 మంది అర్హత సాధించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి గురువారం నాడు పీజీఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పీజీ ఈసెట్‌కు 20415 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో 17722 మంది పరీక్షకు హాజరయ్యారు. 15,644 మంది అర్హత సాధించారు. మైనింగ్, టెక్స్‌టైల్ సహా మొత్తం 19 సబ్జెక్టుల్లో ప్రవేశపరీక్ష నిర్వహించామని కన్వీనర్ ప్రొఫెసర్ ఎం కుమార్, కో కన్వీనర్ డాక్టర్ వీ ఉమామహేశ్వర్‌లు చెప్పారు.