తెలంగాణ

మానవ నిర్మిత అద్భుతం ‘కాళేశ్వరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/మహదేవ్‌పూర్, జూన్ 20: కేసీఆర్ కజలు కన్న కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు స్థాయిలో పూర్తి చేసుకుని శుక్రవారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. శుక్రవారం ఉదయానే్న సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి 8:30 గంటలకు చేరుకుంటారని, 10:30 గంటల సమయంలో మహారాష్ట్ర, తెలంగాణ గవర్నర్లు విద్యాసాగర్‌రావు, నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో సీఎం కేసీఆర్ హోమయజ్ఞం పూర్తి చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభిస్తారు. అనంతరం కనె్నపల్లి పంపుహౌ;కు చేరుకుని పంపుహౌజ్ యొక్క 6వ స్విచ్‌ను ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి గోదావరి నీటిని అంకితం చేస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. అలాగే అన్నారం బ్యారేజీని మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభిస్తారు. అన్నారం పంపుహౌజ్‌ను మంత్రి మహమూద్‌అలీ ప్రారంభిస్తారు. సుందిల్ల బ్యారేజీని మంత్రి మల్లారెడ్డి, పంపుహౌజ్‌ను కొప్పుల ఈశ్వర్‌లు ప్రారంభిస్తారని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం తెలంగాణలోని ప్రతి గ్రామాల్లో సంబురాలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకుంటారని పేర్కొన్నారు. యేళ్ల తరబడి నీళ్లు లేక బీడుబారిన తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం సాగేటప్పుడే నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రొఫెసర్ జయశంకర్‌తో సీఎం కేసీఆర్ చర్చించేవారని, ఆ ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిందే కేసీఆర్ కలలు కన్న కాళేశ్వరం ప్రాజెక్టు అని, ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేయడం ఎన్నో రికార్డులు సొంతం చేసుకుందని, ప్రాజెక్టు నిర్మాణం మానవ అద్భుతమని ఆయన అన్నారు. వర్షాకాలంలో నీళ్లు రాగానే కనె్నపల్లి పంపుహౌస్ నుండి నేరుగా గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి చేరుకుంటాయని, తద్వారా ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు నీళ్లు తరలింపు ఉంటుందని, అనంతరం అక్కడి నుండి ఎస్సారెస్పీ ద్వారా ఇతర ప్రాంతాలకు నీరు చేరుతుందని ఆయన అన్నారు. ఆయన వెంట పెద్దపల్లి జడ్పీఛైర్‌పర్సన్ పుట్టా మధూకర్, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఇఎన్‌సీలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, ఇంటెలిజెన్స్ డీఐజీ శివకుమార్, జిల్లా ఎస్పీ ఆర్.్భస్కరన్, కాటారం ఏ ఎస్పీ పోతరాజు సాయిచైతన్య పలువురు ఉన్నారు.

చిత్రాలు.. కనె్నపల్లి పంపుహౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఈటల రాజేందర్,
*యాగశాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న దృశ్యం