తెలంగాణ

బీజేపీలో చేరికకు రాజ్‌గోపాల్ రెడ్డి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, తనతో అందరు కలిసి రావాలని, రాష్ట్రంలో కేసీఆర్ అరాచకపాలనపై పోరాడేందుకు బీజేపీ సరైన ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఇక్కడ పెద్ద అంబర్‌పేటలో తన అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌గోపాల్ రెడ్డి నిర్ణయాన్ని నిరసిస్తూ ఎంపీపీ చౌటుప్పల్ తాడూరు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేతలు గడ్డం మురళీధర్ రెడ్డి తదితరులు సమావేశం నుంచి నిష్క్రమించారు. కొంత మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంత సేపు సమావేశంలో గొడవ జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తనతో పాటు టీఆర్‌ఎస్ పార్టీయేతర నేతలను వేధిస్తున్నారన్నారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ప్రజలే కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు ఇస్తారన్నారు. గ్రూపులు చేసి భ్రష్టుపట్టించారన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందన్నారు. చంద్రబాబు ప్రచారంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందన్నారు గాంధీభవన్ నేతలం కాదని, ప్రజల మనుషులమన్నారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. కుల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు.