తెలంగాణ

దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: డిగ్రీ కాలేజీల్లో రెండో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియను గురువారం ముగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రెండో దశలో 68,049 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. వారిలో 59,154 మందికి సీట్లు కేటాయించారు. తొలి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తాము కోరుకున్న సీటునే 36,225 మంది పొందగా, తాము కోరుకున్న సీట్లలో రెండో ప్రాధాన్యతనే పొందిన వారు 17895 మంది ఉన్నారు. వెబ్ ఆప్షన్లు నమోదుచేసినా చాలా తక్కువ నమోదు చేయడంతో ఎలాంటి సీటు పొందని వారు 6354 మంది ఉన్నారు. సీట్లు పొందిన వారిలో అబ్బాయిలు 26,415 మంది కాగా, అమ్మాయిలు 32,739 మంది ఉన్నారు. తొలి దశలో 1,53,238 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 1,05,346 మందికి సీట్లు కేటాయించగా, వారిలో 70,780 మంది తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకున్నారు. రెండోదశ సమయానికి సీట్ల సంఖ్య 3.14 లక్షలు కాగా రెండో దశ సీట్ల కేటాయింపు అనంతరం ఇంకా 2,60,154 సీట్లు ఖాళీగా ఉన్నాయని లింబాద్రి చెప్పారు. సీట్లు పొందిన వారికి ఎస్‌ఎంఎస్‌లు పంపించామని, వారు ఆన్‌లైన్‌లోనే రిపోర్టింగ్ చేయాలని, రిపోర్టింగ్‌కు కాలేజీలకు వెళ్లాల్సిన పనే్లదని అన్నారు. జూలై 1 తర్వాత మాత్రమే కాలేజీల్లో రిపోర్టు చేయాలని చెప్పారు. ఈ నెల 25వ తేదీలోగా తమ సీటును కన్ఫర్మ్ చేసుకోకుంటే ఆ సీటును కోల్పోవలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మూడో దశ సీట్ల కేటాయింపునకు 20వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అన్నారు. తొలి దశలో 25,219 మంది అబ్బాయిలు, 45,561 మంది అమ్మాయిలు సీట్లు పొందగా, రెండో దశలో 26,415 మంది అబ్బాయిలు, 32739 మంది అమ్మాయిలు సీట్లు పొందారు. తొలిదశలో 6346, రెండోదశలో 4897 మంది బీసీఎ అభ్యర్ధులు సీట్లు పొందగా, బీసీ -బీ వారు తొలి దశలో 14654, రెండో దశలో 11571 మంది, బీసీ సీ వారు తొలిదశలో 206, రెండోదశలో 165 మంది, బీసీ డీ తొలిదశలో 16884, రెండోదశలో 13223, బీసీఈ తొలిదశలో 4465, రెండోదశలో 3494 మంది, ఒసీ తొలిదశలో 12105, రెండోదశలో 10424 మంది, ఎస్సీ తొలిదశలో 10534 మంది, రెండోదశలో 9702 మంది, ఎస్టీలు తొలిదశలో 5586, రెండోదశలో 5678 మందికి దక్కాయి.
బ్రాంచిల వారీ చూస్తే బీఏలో 3467 మంది, బిఏ సీబీసీఎస్ 3534 మంది, బీఎ లిటరేచర్ 37 మంది, బికాం 19706 మంది, బిఎస్సీ 13 మంది, బిఎస్సీ లైఫ్ సైనె్సస్ 13746 మంది, బిఎస్సీ ఫిజికల్ సైనె్సస్ 16767 మంది, వొకేషనల్ 14 మంది, బిబిఏ 1530, బీబీఎం 79 మంది, బీసీఏ 251, బిఎస్‌డబ్ల్యు 10 మంది తమ సీట్లను కన్ఫ్‌ర్మ్ చేసుకున్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో తొలిదశలో 11408 మంది, రెండో దశలో 14208 మంది, అటానమస్ కాలేజీల్లో తొలిదశలో 6099, రెండోదశలో 4997, ప్రైవేటు ఎయిడెడ్‌లో తొలి దశలో 3502, రెండోదశలో 4609, ప్రైవేటు అటానమస్‌లో తొలిదశలో 477, రెండో దశలో 690 మంది, రైల్వే కాలేజీలో తొలి దశలో 49 మంది, రెండో దశలో 93 మంది , యూనివర్శిటీ అటానమస్ కాలేజీల్లో తొలి దశలో 1704 మంది, రెండో దశలో 1301 మంది, యూనివర్శిటీ కాలేజీల్లో తొలి దశలో 387, రెండో దశలో 437 మంది తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకున్నారు.
యూనివర్శిటీల పరంగా చూస్తే కాకతీయలో 13530, మహాత్మాగాంధీ యూనివర్శిటీ పరిధిలో 2729, ఉస్మానియా పరిధిలో 29354, పాలమూరు పరిధిలో 4210, శాతవాహన యూనివర్శిటీలో 4881, తెలంగాణ యూనివర్శిటీ పరిధిలో 4450 మంది సీట్లను పొందారు.