తెలంగాణ

ఇక పాలమూరు ఎత్తిపోతలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయిన నేపథ్యంలో ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా ముందుకు సాగుతాయని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా మంత్రి ఒక ప్రకటన జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో తెలంగాణలో కొత్తశకం ప్రారంభమవుతోందన్నారు. సాగునీటికి సంబంధించి భారీ, మధ్య తరహా, చిన్న తరహా ప్రాజెక్టులు ఉపయోగం లోకి వస్తుండటంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మూడు అంశాలపై కొనసాగిందని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. మూడు అంశాల్లో నీళ్లే ప్రధానమైనవన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నీటిపారుదల ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉంటూ వచ్చాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో భవిష్యత్తు తరాలు కాళేశ్వరం ముందు తెలంగాణ, కాళేశ్వరం తర్వాత తెలంగాణ అంటూ గుర్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో ప్రజల్లో ఎంత ఆనందం పెల్లుబికిందో, అంతే ఆనందం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంలో కలుగుతోందన్నారు. తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కాళేశ్వరం నిర్మాణంలో శ్రమించిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముందుకు సాగకుండా విపక్షాలు కుట్రపన్నాయని, దాంతో ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పనులు పూర్తయిన సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక నుండి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై దృష్టి కేంద్రీకరిస్తారన్నారు. పాలమూరు పాత జిల్లా పరిధిలోని సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరుతామన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతులకు చేయూత ఇచ్చేందుకు ఇప్పటికే 24 గంటల పాటు ఉచితంగా వ్యవసాయానికి విద్యుత్తు ఇస్తున్నామని, రైతుబంధు కింద ఎకరానికి ఒక్కో సీజన్‌కు 5000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.