తెలంగాణ

బీజేపీపై తెరాస కక్ష సాధింపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ ప్రతిపక్ష పార్టీలపై వేధింపుచర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసుల చేత దాడి చేయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోషామహల్ ప్రాంతంలో రెండేళ్లకోసారి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని వీరోచిత పోరాట చేసిన రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని పునఃప్రతిష్టంచిడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ విగ్రహం ఇక్కడ ఉండడం మజ్లిస్‌కు కంటగింపుగా ఉందన్నారు. రాజాసింగ్‌పై జరిగిన దాడికి అదనపు డీజీపీ సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టిన ఎంఐఎం ఎమ్మెల్యేకు భాషా ఖాద్రీపై పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలకు పోలీసులు ఎర్రతివాచీలు పరుస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో టీఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతున్నదన్నారు. మజ్లిస్‌తో మైత్రి కోసమే బీజేపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ హింసా రాజకీయాలకు తెరదీసిందన్నారు. బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీకి బుద్ధి చెప్పినట్లే, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతారన్నారు. ఆంక్షలతో బీజేపీని అణగదొక్కలేరన్నారు. ఎమ్మె ల్యే రాజాసింగ్‌పై దాడికి నిరసనగా 21వ తేదీ శుక్రవారం గోషామహల్ బంద్ నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని జాతీయాధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను శాంతియుతంగానే ఎదుర్కొంటామన్నారు.
కాగా పోలీసుల దాడిలో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గాయాలయ్యాయని, దీనికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు డీజీపీని కోరారు. ప్రజా ప్రతినిధి పట్ల పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యమేలుతోందన్నారు. హక్కుల కోసం పోరాడే వారిపై నిర్బంధ కాండ సాగుతోందన్నారు.
చిత్రం... డీజీపీని కలిసి బయటకు వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు