తెలంగాణ

వీధి వ్యాపారులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 22 : సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీధీ వ్యాపారుల కోసం ప్రత్యేకంగా రూ.1.30 కోట్లతో వ్యాపార విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట నాసర్‌పురాలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ పట్టణంలో 11 మహిళా సమాఖ్య భవనాలు నిర్మించినట్లు తెలిపారు. ఏ పట్టణంలోనూ ఇన్ని భవనాలు లేవన్నారు. త్వరలో ముస్తాబాద్ రోడ్డు పట్టణ వీధి వ్యాపారుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. 45 షాపులు నిర్మించి వీధీ వ్యాపారులకు చేయుత అందించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో 270 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. దోమలు, ఈగలు లేని పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి ఒక్కరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనేక్షన్ ఇప్పించుకోవాలని సూచించారు. అభివృద్ధి ఏంత ముఖ్యమో.. ప్రజల ఆరోగ్యం కూడ అంతే ముఖ్యమన్నారు. అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన అభిమతమన్నారు. అనంతరం ముస్తాబాద్ రోడ్డులో నిర్మించే వీధి విక్రయ సముదాయ ప్రణాళికను ఆవిష్కరించారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని 8వ వార్డులోని నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుండి రాజీవ్హ్రాదారి వరకు ఫోర్ లైన్ రహదారిగా మార్చబొతున్నట్లు మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన శాలివాహన సంఘ భవనాన్ని ప్రారంభించారు. గోదావరి నీళ్లతో నర్సాపూర్‌లోని మూడు చెక్ డ్యామ్‌లు కళకళ లాడుతాయన్నారు. శాలివాహనులకు సైతం మంచి రోజులు వస్తున్నట్లు తెలిపారు. యాదవులు ఆర్థికంగా ఎదగాలని, త్వరలోనే రెండవ దశ గొర్రెల పంపిణీని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, నాయకులు నాగిరెడ్డి, ఐలయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.