తెలంగాణ

ఎత్తిపోతల ద్వారానే కరవు పరిష్కారం: చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణలో కరవుకు శాశ్వత పరిష్కారం ఎత్తిపోతల పథకాలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణకు సాగు, తాగునీటి సాధనకు గోదావరి జలాలే శరణ్యమని 40 ఏళ్ల క్రితమే సీపీఐ పేర్కొందని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కూడా గోదావరి జలాల వినియోగానికి ప్రయత్నించిందని, ప్రముఖ సాగునీటి ఇంజనీర్ కే శివరామకృష్ణయ్య సైతం ఎత్తిపోతల ద్వారానే తెలంగాణ కరవుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారని చెప్పారు. కేసీఆర్ నేడు మేడిగడ్డ వద్దన కట్టిన రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్యాకేజీలో జరుగుతున్న ప్రగతి పనులను పరిశీలించడానికి జూన్ 25, 26 తేదీల్లో సీపీఐ బృందం పర్యటించనుందని అన్నారు. 25వ తేదీన ఉదయం కనె్నపల్లి పంప్ హౌస్ , తర్వాత సుందిల్ల పంప్ హౌస్, రామగుండం పంప్ హౌస్, ఎల్లంపల్లి రిజర్వాయర్, మరుసటి రోజు మిడ్ మానేరు రిజర్వాయర్, అనంతగిరి పంప్ హౌస్, మల్లన్నసాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ రిజర్వాయర్ పరిశీలిస్తామని అన్నారు.