తెలంగాణ

ఏపీలో పెంచారు, తెలంగాణ సంగతేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచారని, తెలంగాణలోనూ పెంచాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్ట్ఫా అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే ఏసురత్నం, ప్రధానకార్యదర్శి మందా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కనీస వేతనాలు అమలుచేయాలని జూన్ 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. మున్సిపల్ ఉద్యోగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు సూచించారు. వయస్సులో చిన్నవారైనా మున్సిపల్ కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి వేతనాలు పెంచిన జగన్మోహన్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రెండో మారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా, మున్సిపల్ కార్మికులపై ఏ మాత్రం శ్రద్ధ లేదని తీవ్రంగా విమర్శించారు. కడుపు మండి ఆందోళన చేస్తే కార్మిక సంఘాలను స్థానిక ప్రభుత్వం అవహేళన చేస్తోందని, ఆంధ్రాలో కార్మికులకు సీఎం జగన్మోహన్‌రెడ్డి వేతనాలు పెంచితే ఇక్కడి నేతలు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప సుప్రీంకోర్టు తీర్పును మాత్రం అమలుచేయడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేసి వాటిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
సంపద సృష్టికర్తలను అవమానించిన మోదీ ప్రభుత్వం
దేశంలో సంపదసృష్టికర్తలైన కార్మికుల సలహాలను బడ్జెట్‌లో పరిగణించకుండా మోదీ ప్రభుత్వం అవమానించిందని ఎఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు టీ నరసింహన్ పేర్కొన్నారు. ప్రధానిగా రెండోమారు అధికారం చేపట్టిన తర్వాత కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలపై సలహాలూ, సూచనలు కోరిందని, ఈ కసరత్తులో భాగంగా కార్మిక సంఘాల నేతలను కూడా రమ్మనమని చెప్పారని, తీరా కార్మిక సంఘాల నేతలు రాగానే ఆర్ధిక మంత్రి హాజరుకాకుండా సహాయ మంత్రిని పంపించారని కార్మిక సంఘాల ప్రతినిధులకు రెండు మూడు విషయాలకే పరిమితమై సలహాలు ఇవ్వాలని కూడా పేర్కొన్నారని దానివల్ల లాభం లేకుండా పోయిందని టీ నరసింహన్ చెప్పారు. దేశ ఆర్ధికాభివృద్ధికి, సంపద సృష్టికి కారకులైన కార్మిక సంఘాల ప్రతినిధుల సమావేశానికి ఆర్ధిక మంత్రి రాకపోవడం, దేశంలో యావత్తు కార్మిక వర్గాన్ని మోదీ ప్రభుత్వం మరోమారు తన కార్మిక వ్యతిరేక ధోరణిని బహాటంగా ప్రదర్శించారని, దేశంలో యావత్ కార్మిక వర్గాన్ని అవమానించారని అన్నారు. అదే సమయంలో తదుపరి నీతి ఆయోగ్ కార్పొరేట్ సంస్థల అధిపతులు, వారి ఆర్ధిక విధానాలను బలపరిచే ఆర్ధిక నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారని, దానికి ప్రధానిగ స్వయంగా హాజరై వారి సలహాలు, సూచనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారని అన్నారు.