తెలంగాణ

విత్తన రంగంలో అంతర్జాతీయ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: విత్తనోత్పత్తి రంగంలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని ఎఫ్‌ఏఓ (్ఫడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘విత్తనోత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్’ అంశాలపై రెండురోజుల వర్క్‌షాప్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిసహాయ, సహకారాలు అందిస్తోంది. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, ఆఫ్రికాదేశాలు, దక్షిణాసియా దేశాలకు తెలంగాణ రాష్ట్రం నుండి విత్తనాలను ఎగుమతి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా రైతు కావడం వల్ల, రైతుల బాధలు, సమస్యలు క్షుణ్ణంగా తెలుసునని, అందుకే వ్యవసాయ అభివృద్ధికి, పంటల ఉత్పత్తి పెంచేందుకు, రైతులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించారని గుర్తు చేశారు. పంటల పెట్టుబడి కోసం రైతుబంధు కింద ఎకరాకు 5000 రూపాయలు ఇస్తున్నారని, సేద్యానికి ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నారని, రైతులు ఏ కారణం చేత మరణించినా, బీమా కింద వారి కుటుంబానికి ఐదులక్షల రూపాయలు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు విత్తనాల ఉత్పత్తికి అనుగుణంగా ఉండటం వల్ల అనేక కంపెనీలు తెలంగాణ ఆధారంగా విత్తనోత్పత్తి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుండటంతో రైతులకు పంటలు లాభదాయకంగా ఉంటున్నాయన్నారు. తెలంగాణ నుండి విత్తనాలను దిగుమతి చేసుకునేందుకు వివిధ దేశాలు ముందుకు రావాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విత్తనోత్పత్తి చేస్తున్న రైతులకు చేయూత ఇచ్చేందుకు రైతు సమన్వయ సమితి సిద్ధంగా ఉందన్నారు.
భారత్, ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో దాదాపు ఒకే రకమైన పంటలు సాగులో ఉన్నాయని, అందువల్ల తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలకు మంచి డిమాండ్ ఉందని, సులభంగా మార్కెటింగ్ అవుతుందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ప్రపంచ విత్తన వ్యాపారంలో భారత్ భాగం కేవలం 4.4 శాతం మాత్రమే ఉందని, కేంద్రప్రభుత్వం దీన్ని 10 శాతంగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఓఈసీడీ ధృవీకరణ ద్వారా విత్తనాలు ఎగుమతి చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణకు పేరు వచ్చిందన్నారు. ఫిలిప్పైన్స్, సూడాన్, ఈజిప్ట్ దేశాలు, మయన్మార్, థాయ్‌లాండ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు అవసరమైన పత్తి విత్తనాన్ని ఎగుమతి చేయగలిగే శక్తి మనకుందన్నారు. జొన్న, సజ్జ, పప్పుదినుసులు, కూయగాయలు, మొక్కజొన్న విత్తనాలు ఎగుమతి చేయగలమన్నారు. విత్తనాల నాణ్యతపైనే దేశాల ఆహారభద్రత ఆధారపడి ఉందన్నారు. దేశంలో మొక్కజొన్న, వరి, సోయా, సజ్జ, జొన్న పంటల హైబ్రీడ్ విత్తనాల్లో 60 శాతం తెలంగాణా రాష్ట్రానిదేనన్నారు. రాష్ట్రంలో 1500 గ్రామాల్లో మూడు లక్షల ఎకరాల్లో 65 లక్షల కింటాళ్ల విత్తనం ఉత్పత్తిఅవుతోందన్నారు. రాష్ట్రంలో 2.50 లక్షల మంది రైతులు విత్తనోత్పత్తిలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో 413 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, 13 పరీక్షా కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో విత్తనపరిశ్రమ అభివృద్ధి రేటు 7 శాతం ఉండగా, భారతదేశంలో 17 శాతం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో విత్తన ధృవీకరణ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఇస్తా అధ్యక్షుడు డాక్టర్ క్రెయిగ్ మాక్‌గిల్, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతినిధి డాక్టర్ చికెలుబా తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...వర్క్‌షాప్ ప్రారంభిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి