తెలంగాణ

కేసీఆర్‌ది రాచరిక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్, ప్రజల దృష్టి మరలించడానికే కొత్త సచివాలయాన్ని తెరపైకి తెచ్చారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ దుయ్యబట్టింది. ఎవరి స్పందించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి కేసీఆర్ రాజు కాదని, ప్రజలు ఎన్నుకున్న పాలకుడు మాత్రమేన్నారు. గాంధీభవన్‌లో సోమవారం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి, కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలను దారి మళ్లించడానికే కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణం అంశాన్ని సీఎం తెరపైకి తీసుకొచ్చారని జీవన్‌రెడ్డి విమర్శించారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా 20 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారన్నారు. ఉపాధ్యాయుల నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరితే సీఎం కేసీఆర్ అసహనంగా మాట్లాడారని మండిపడ్డారు. సచివాలయంలోని సమతా, డీ, హెచ్ బ్లాక్‌లను వందేళ్లేపాటు ఉండేలా నిర్మిస్తే వాటిని కూల్చేసి కొత్తగా నిర్మించడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన హయాంలో కొత్త భవనాలు నిర్మించారన్న పేరు కోసమే సీఎం కేసీఆర్ తాపత్రయపడుతున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎర్రమంజిల్‌లో శాసనసభ భవనాన్ని నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తక తప్పదని హెచ్చరించారు. అయినా అక్కడే నిర్మించాలనుకుంటే ఎర్రమంజిల్ నుంచి కూకట్‌పల్లి వరకు ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌లను ఇప్పటిదాకా ప్రకటించలేదన్నారు. కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో కొద్ది వర్షానికే మురికినీటి వ్యవస్థ లేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ విశ్వనగరం కాస్త కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం పడితే బయటికి రావద్దని జిహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళనకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమి లేవన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌లో చేసిందేమి లేదని విమర్శించారు. లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్ నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనేనని కోదండరెడ్డి గుర్తు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణా చర్యకు ఏఐసీసీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆ కమిటీకి చైర్మన్ కూడా అయిన కోదండరెడ్డి వివరించారు.
చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి