తెలంగాణ

28న బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 24: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈనెల 28న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీలో తన చేరికకు సంబంధించి రాజగోపాల్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ నాయకులతో చర్చలు జరిపినట్టు సమాచారం. తనతో పాటు కాంగ్రెస్ నుండి ఎవరెవరు బీజేపీ తీర్ధం తీసుకోబోతున్నారన్న వివరాలను కూడా రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నేతలకు వివరించారని, తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు తనకు తగిన స్వేచ్ఛనివ్వాలని ఆయన బీజేపీ నాయకత్వాన్ని కోరినట్టు తెలుస్త్తోంది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీ జాతీయ నాయకుల భేటీలో చర్చించిన అంశాలపై రెండు పార్టీల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నుండి రాజగోపాల్‌రెడ్డి సస్పెన్షన్‌కు సైతం ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం రంగం సిద్ధం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం నెలకొంది. ఒకటి రెండు రోజుల్లో రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయవచ్చన్న ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తుంది.
కాగా రాజగోపాల్‌రెడ్డి తనతో మునుగోడు నియోజకవర్గం లక్కారానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఫోన్‌లో మాట్లాడిన సందర్భంలో తాను బీజేపీలో చేరబోతున్నానని, అందరం కలిసి బీజేపీలో చేరుదామంటూ కోరిన తీరు ఆయన పార్టీ మార్పుపై స్పష్టతనిస్తోంది. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవని, తెలుగు రాష్ట్రాల్లో మునుముందు బీజేపీ ప్రభుత్వాలే వస్తాయని, బీజేపీలోకి వెళితేనే తాను భవిష్యత్‌లో ముఖ్యమంత్రినవుతానంటు కార్యకర్తతో జరిపిన సంభాషణలో రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల రికార్డు వాట్సాప్ గ్రూప్‌ల్లో వైరల్‌గా మారింది. రాహుల్‌గాంధీ సైతం పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారని, కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, తెలంగాణలో కుంతియా, ఉత్తమ్‌లతో పార్టీ నాశనమైందని, దేశంలో, రాష్ట్రంలో వచ్చేది బీజేపీయేనంటూ చేసిన రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మాటల నేపథ్యంలో బీజేపీ ఆయన చేరిక ఇక లాంఛనమేనని తేలిపోయంది.