తెలంగాణ

కోటి ఎకరాల మాగాణి తెరాస లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 24: గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కృష్ణానది ఆయకట్టును గోదావరి జలాలతో పచ్చని పంటలు పండించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్, నారాయణపేటలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన పార్టీ అని ప్రజల ఆకాంక్ష తెలంగాణ తెచ్చిన పార్టీ అని తెలిపారు. ఇలాంటి ప్రాంతీయ పార్టీకి ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఉండటం చాలా అవసరం అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రతి జిల్లాకు కార్యాలయాలు లేవని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ముఖ్యంగా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అనే నినాదానికి సాకారం అవుతుందని తెలిపారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 80శాతం ఆయకట్టుకు సాగునీరు రాబోతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణానది బేసిన్ ఆయకట్టుకు కూడా తరలిస్తామన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి అను సంధానం చేసి శ్రీశైలం ప్రాజెక్టులోకి తరలిస్తామని చెప్పారు. కాళేశ్వరం తరహలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని, దాంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కల సాకారం నెరవేరుతుందన్నారు. వ్యవసాయం అంటేనే తెలంగాణ రాష్ట్రం అనే దిశగా ప్రపంచస్థాయిలో ఎదగనుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కొందరు నాయకులు ఇక తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆందోళనకు గురై పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నారని వారికి ప్రజలే రాజకీయ సమాధి చేస్తారని హెచ్చరించారు. మరో రెండుమూడేళ్లలోపు పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 12లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు 60శాతం జరిగాయని తెలిపారు. అన్ని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ కొందరు నాయకులు కోర్టులో వేసిన కేసులను కూడా అధిగమిస్తూ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్