తెలంగాణ

తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 24: తెలంగాణ ఉద్యమపార్టీగా పురుడుపోసుకొని ప్రజల దీవెనతో రాజకీయపార్టీగా రూపాంతరం చెంది దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూ అన్ని వర్గాల ఆదరణ పొందిన టీఆర్‌ఎస్ పార్టీ నేడు తిరుగులేని రాజకీయశక్తిగా మారిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయం పక్కన టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌లతో కలిసి శాస్రోక్తంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఏ పార్టీ కూడా ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. వందేళ్ల నిండిన రాజకీయ పార్టీలకు కూడా సాధ్యం కాని అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్న పార్టీ తమదేనన్నారు. దేశ చరిత్రలో ప్రతి ఏటా ప్రజల సంక్షేమానికే రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో కొత్తగా ఏర్పడినప్పటికీ తొలి ఐదేళ్లలోనే అన్నింటా ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడితే ఎలా అభివృద్ధి చేయాలో కేసీఆర్ ఉద్యమ సమయంలోనే ప్రణాళికలు రూపొందించుకొని వాటిని అమలుపరుస్తూ ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. ప్రభుత్వపరంగానే కాకుండా పార్టీపరంగానూ టీఆర్‌ఎస్ పార్టీ అనేక రికార్డులను సాధించిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పార్టీ సభ్యత్వాల కోసం ప్రజలే స్వచ్ఛందంగా తరలివచ్చి బారులు తీరుతున్న గొప్పదనాన్ని దక్కించుకుందన్నారు. గ్రామస్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు పార్టీని పటిష్టమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరుసాధించిందన్నారు. పార్టీ నిర్మాణం, కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం పరితపిస్తారన్నారు. అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంతో మరో కొత్త రికార్డును నమోదు చేస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే కార్యాలయాలన్నింటినీ దసరా నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గుజ్జ దీపికయుగేంధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, హుజూర్‌నగర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, సూర్యాపేట, కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌లు గండూరి ప్రవళిక, వంటిపులి అనితలతో పాటు వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిపాల్గొన్నారు.
చిత్రం...సూర్యాపేటలో టీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి