తెలంగాణ

దిష్టిబొమ్మ దగ్ధంలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 24: తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై అత్యాచారం, ఆపై హత్య సంఘటనపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నిస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంటలు ఇద్దరు బీజేపీ నేతలకు అంటుకోవడంతో వారు గాయపడ్డారు. దీంతో ఆందోళనకారులు పోలీస్ వాహనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీహిత సంఘ్టన దేశ వ్యాప్తంగా చఠ్చ జరుగుతుండగా వరంగల్‌లో ఇంకా ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం బీజేపీ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడిన మానవ మృగం ప్రవీణ్‌ను వెంటనే ఉరి తీయాలంటూ బీజేపి అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఏం కేసీఆర్ దిష్ఠి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులకు, బీజేపి కార్యకర్తలకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. సీఎం దిష్టిబొమ్మ దగ్ధాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈలోగా పెట్రోల్‌తో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దిష్టిబొమ్మ దగ్ధానికి ముందుగా కొద్దిగా పెట్రోల్ పోసి అంటించగా ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి వెనుకనుండి వచ్చి మరింత పెట్రోల్ పోయడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున లేచాయి. ఈ సంఘటనలో అక్కడే ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా బీజేపి అధ్యక్షురాలు రావు పద్మకు, ఆ పార్టీ నాయకుడు బింగి శ్రీనివాస్‌కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ సంఘటన పట్ల బీజేపి కార్యకర్తలు ఒక్కసారిగా కోపోద్రిక్తులై పోలీస్ వాహనంపై దాడికి విఫల యత్నం చేశారు. పోలీస్ వాహనం అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తకంగా మారడంతో పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. తీవ్రంగా గాయాలైన బింగి శ్రీనివాస్, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చిత్రాలు.. దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా ఉవ్వెత్తున లేచిన మంటలు
* గాయపడి రోదిస్తున్న బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ