తెలంగాణ

వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 26: రెండు గ్రామాల మధ్యన స్థలం వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఒక గ్రామానికి చెందిన యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన శ్రీవీరంజనేయస్వామి ఆలయ స్థలాన్ని కొందరు రెవిన్యూ అధికారులు కావాలని బస్వాపూర్ గ్రామం రెవిన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. దాంతో ఈస్థలం సిద్దిరామేశ్వరనగర్ వాసులదేనంటూ గత మూడు రోజుల నుండి ఆ గ్రామవాసులు ఆందోళన చేస్తున్నారు. రాస్తారోకోలతో పాటు చివరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సైతం ముట్టడించి ఆందోళనకు దిగారు. కాగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ హామీ ఇచ్చినప్పటికీ, విచారణలో మళ్లీ జాప్యం జరుగుతోందని, తమ గ్రామానికి న్యాయం చేయడం లేదంటూ బుధవారం ఉదయం గ్రామానికి చెందిన కొందరు యువకులు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. యువకులు నినాదాలు చేస్తూ తమకు న్యాయం జరగకుంటే ట్యాంకుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుండటంతో ఎట్టకేలకు పోలీసులు, రెవిన్యూ అధికారులు రంగ ప్రవేశం చేశారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు ముందుగా వాటర్ ట్యాంకు ఎక్కిన వారు కిందకు క్షేమంగా దిగాలని, ఈ స్థల సమస్యను అన్ని కోణాల నుండి పాతరికార్డులు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని తహశీల్దార్, ఎంపీడీవోలు సైతం హామీ ఇచ్చినా యువకులు దిగిరాక పోవడంతో గ్రామ పెద్దలతో పాటు భిక్కనూర్ మండలానికి చెందిన పెద్దలతో చర్చించి ఈ స్థలం ఎవరిది అనే విషయం అన్ని కోణాల నుండి విచారణ జరిపించేందుకు కలెక్టర్ సైతం ఆదేశించారని, ఆందోళనలు చేయవద్దని కోరారు. గ్రామానికి చెందిన మ్యాప్‌తో సహా వచ్చిన తహశీల్దార్ గ్రామ పెద్దలతో చర్చించారు. శ్రీవీరంజనేయస్వామి ఆలయంతో పాటు ఇదే స్థలంలో భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని సైతం నిర్మించారు. ఇక్కడ భక్తుల రాక కూడా పెరుగుతోంది. ఇప్పుడు బస్వాపూర్, సిద్దిరామేశ్వరనగర్ గ్రామాల మధ్య స్థల వివాదం రోజురోజుకు ముదురుతోంది. బస్వాపూర్ గ్రామ పరిధిలో ఉందని ఆ గ్రామస్తులు ఈ స్థలం తమ గ్రామానికి చెందినది చెప్పుకుంటున్నారు. కాని సిద్దిరామేశ్వరనగర్ వాసులు మాత్రం ఇది బస్వాపూర్‌కు చెందిన స్థలం కాదు, తాతల కాలం నుండి కూడ సిద్దిరామేశ్వరనగర్‌కు చెందిన స్థలం అంటుండటంతో సమస్య చివరకు మూడు రోజుల నుండి రోజురోజుకు ఉద్ధృతమవుతూ చివరకు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కే వరకు వచ్చింది. సర్వేయర్ వచ్చిన తరువాత ఈ స్థలం పూర్తిగా విచారణ జరిపించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చేస్తామని రెవిన్యూ అధికారుల హామీ మేరకు యువకులు ఆందోళన విరమించారు. యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్న సమయంలో మొత్తం గ్రామం అంతా కూడా తరిలి వచ్చి ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ, ఎవరూ కూడా ట్యాంక్‌పై నుండి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దంటూ కింది నుండి నినాదాలు చేశారు.