తెలంగాణ

బాలుడిపై ఊర కుక్కల దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకుమట్ల, జూన్ 26: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి శివారు కుమ్మరిపల్లిలో బుధవారం నవీన్ అనే పది సంవత్సరాల బాలుడిపై మూడు ఊరకుక్కలు మూకుమ్మడి దాడి చేయశాయ. అతని పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళితే కుమ్మరిపల్లికి చెందిన బరిభద్రుల సతీష్-స్వప్న దంపతుల పెద్ద కుమారుడైన నవీన్ పాఠశాలకు వెళ్లనని మారం చేశాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని ఇంటి వద్దనే వదిలి వ్యవసాయ పనులకు వెళ్లారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన అనంతరం నవీన్ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న క్రమంలో ఐదు ఊరకుక్కలు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి. విచక్షణారహితంగా నవీన్‌ను కరవడంతో పాటు తలపై రక్కడంతో తలపైభాగంలోని చర్మం మొత్తం బయటకు వచ్చింది. వెంటనే స్థానికులు గమనించి బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే నవీన్ శరీరమంతా తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్సకు తీసుకెళ్లే సమయానికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
వెంటనే పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు, గ్రామస్థులు అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఊరకుక్కల దాడిలో నవీన్ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతుండటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఊర కుక్కలు ఈ స్థాయిలో దాడి చేయడం ఇదే మొదటిసారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఊర కుక్కలను నియంత్రించాలని ఈ సందర్భంగా గ్రామస్థులు డిమాండ్ చేశారు.