తెలంగాణ

ఇంజనీరింగ్ ఫీజుల పెంపు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: ఇంజనీరింగ్ కాలేజీల్లో 2019-22 బ్లాక్ పీరియడ్‌కు ఫీజులను భారీగా పెంచడం దారుణమని తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య పేర్కొన్నారు. గతంలో 50వేలు ఫీజు ఉన్న కాలేజీలను లక్ష రూపాయిల లోకి తెచ్చేశారని విమర్శించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతనే పూర్తిస్థాయి ఫీజులను నిర్ణయించాలనే టీఏఎఫ్‌ఆర్సీ చేసిన మొదటి నిర్ణయానికి భిన్నంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఫీజులు పెంచడం సరైంది కాదని వారు చెప్పారు. శ్రీనిధి, వాసవి, వీజేఐటీ, సీబీఐటీ, అనురాగ్, మల్లారెడ్డి తదితర కాలేజీల్లో ఫీజులు 15 శాతానికి కంటే ఎక్కువగా పెరిగాయని కొన్ని కాలేజీల్లో ఫీజులు 40 శాతం వరకూ పెరిగాయని అన్నారు. ఇది చాలా అన్యాయమని వారు పేర్కొన్నారు. అన్ని కాలేజీల్లో ఫీజులు 15 శాతం మించకుండానే పెంచాలని వారు కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లోని చివరి పేరాలో షరతుల ప్రకారం అన్ని కాలేజీల్లో నియంత్రణ కమిటీ ప్రత్యక్షంగా సందర్శించి వాస్తవ భౌతిక పరిస్థితుల ఆధారంగా పూర్తిస్థాయి ఫీజులను నిర్ణయించే పని మూడు నెలల్లో పూర్తి చేయాలని, తద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా మధ్యలో చదువులకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మండల్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

హైదరాబాద్, జూలై 6: మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ , అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నవీకరించిన ఎంపిక జాబితాను పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది. 2018 సెప్టెంబర్ 3న జరిగిన లిఖిత పరీక్ష ఆధారంగా 481 పోస్టులకు 473 పోస్టులను భర్తీ చేశారు. జోన్ -6లో మహిళా కోటా సహా పలు కోర్టు కేసులను దృష్టిలో ఉంచుకుని 25 పోస్టులను భర్తీ చేయలేదు. అయితే ఇప్పటికే ఎంపికైన అభ్యర్ధుల్లో ఎవరైనా అనాసక్తి చూపితే వారి అభిప్రాయాలను వెబ్ పోర్టల్ ద్వారా స్వీకరిస్తున్నట్టు కమిషన్ పేర్కొంది. హైకోర్టులో దాఖలైన 1494/2018 పిటీషన్ ఆధారంగా వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మిగిలిన పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
అగ్రికల్చర్ కోర్సులకు నోటిఫికేషన్

హైదరాబాద్, జూలై 6: ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదివి ‘తెలంగాణ ఎంసెట్-2019’ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, ఫిషరీస్ సైన్స్‌లలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు నోఫికేషన్ జారీ చేశామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యూనివర్సిటీ పరిధిలోని ఆరు వ్యవసాయ కాలేజీల్లో బీఎస్‌సీ ఆనర్స్ అగ్రికల్చర్‌లో 432 సాధారణ సీట్లు, 75 పేమెంట్ సీట్లు ఉన్నాయన్నారు. కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రెండు కాలేజీల్లో బీఎస్‌సీ ఆనర్స్ హార్టికల్చర్‌లో 130 సాధారణ సీట్లు, 20 పేమెంట్ల సీట్లు ఉన్నాయన్నారు. పీవీ నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మూడు కాలేజీల్లో బీవీఎస్‌సీ అండ్ ఎనిమల్ హస్బెండరీలో 158సీట్లు ఉన్నాయన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు, ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూర్‌లోని ఫిషరీస్ సైన్స్ కాలేజీల్లో బీఎఫ్‌ఎస్‌సీలో 36 సీట్లు ఉన్నాయన్నారు. ఈ కోర్సుల్లో చేరాలని భావిస్తున్న అభ్యర్థులు ఈ నెల 27 వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాలని సుధీర్‌కుమార్ సూచించారు. ఎంసెట్-2019 ర్యాంక్ ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి సీట్ల భర్తీ చేస్తామన్నారు.
అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్‌సీ ఆనర్స్ అగ్రికల్చర్‌లో 25 సీట్లు ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్ కోటా కింద భర్తీ చేస్తామన్నారు. ఈ సీట్ల భర్తీకి జూలై 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ తెలిపారు. ఇంటర్ బైపీసీ తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఈ కోటాలో సీట్లకు అర్హులని, ఎంసెట్ ర్యాంక్ అవసరం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలుకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
వ్యక్తిగత సమాచార గోప్యతను దెబ్బతీస్తున్న టీఆర్‌ఎస్: దాసోజు

హైదరాబాద్, జూలై 6: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన సమగ్ర నివేదికపై శే్వతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విలేఖర్లతో మాట్లాడుతూ, పౌరుల వ్యక్తిగత సమాచార వివరాలను 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందించిన సమగ్ర నివేదికపై శే్వతపత్రాన్ని విడుదల చేయాలని కోరారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇస్తామని రాష్ట్ర ఐటీ కార్యదర్శి చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల సమాచారాన్ని చోరీ చేసిందని చెప్పి ఇటీవల పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసును టీడీపీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారన్నారు. ఇప్పుడు అదే విధంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెడతారా అని నిలదీశారు. మీ అందరి సమాచారం తన వద్ద ఉందని అంటే, కచ్చితంగా బ్లాక్ మెయిల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన రాష్ట్రప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. పౌరుల అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచార సేకరణ చేయడం పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన, వివ్వసనీయతపై వేటు వేయడమేనన్నారు.

విత్తన సదస్సుకు రైతులను పిలిచారా?

హైదరాబాద్, జూలై 6: రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన సదస్సు జరిగితే, రైతులను రాష్ట్రప్రభుత్వం ఆహ్వానించకపోవడం దారుణమని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ ఆనే్వష్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ఖమ్మం, కరీంనగర్‌లో విత్తనాల వల్ల రైతులు నష్టపోతే వారికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అంతర్జాతీయ సదస్సుల వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. వ్యాపారుల ప్రయోజనం కోసమే ఈ సదస్సును నిర్వహించారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రైతులను కేంద్రం దగా చేసిందన్నారు. కనీస మద్దతు ధరలను శాస్ర్తియంగా ప్రకటించలేదన్నారు.
రైల్వే ప్రయాణికులకు స్వచ్ఛమైన ఆహారం

హైదరాబాద్, జూలై 6: రైల్వే ప్రయాణీకులను ఆకర్శించడానికి అధికారులు శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రయాణీకులకు ఇచ్చే ఆహారం (్భజనం) స్వచ్ఛంగా,మంచిగా ఉండేలా కేటరింగ్ విధానంలో మార్పులు తెస్తున్నారు. శనివారం సికింద్రాబాద్ హవామహల్ సంచార్ భవనంలో ఆహార పదార్థాల తయారీపై రైల్వే అధికారులు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ వర్కషాప్‌లో రైల్వే కేటరింగ్ కాంట్రాక్టర్లు, వెండర్స్, వంట మనుషులు, క్లీలింగ్ స్ట్ఫా, ప్యాంటరీ కార్ సిబ్బంది పాల్గొన్నారు. ఆహార భద్రతపై ఒకే విధానాన్ని అమలు చేయాలన్న అంశాలపై చర్చించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆనంద్ భాటియా మాట్లాడుతూ గతంలో కొద్ది రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆహారం బాగుండేదని అన్నారు. అయితే ప్రస్తుతం రైల్వేలో ఆహార పదార్థాల తయారీపై అధికారులు దృష్టిపెట్టడం జరుగుతోందన్నారు. అందుకు వంట మనుషులకు సైతం శిక్షణ ఇస్తున్నారన్నారు. ఆహార పదార్థాల తయారీలో మెరుగుపర్చడంతో పాటు పరిశుభ్రతపై కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్కషాప్‌ను రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.