తెలంగాణ

అమిత్ షా బిజీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటన శనివారం బిజీ బిజీగా సాగింది. ఈ పర్యటనలో రానున్న రోజుల్లో బీజేపీని పటిష్టంగా తీర్చిదిద్దడంపై దృష్టినిసారించారు. శనివారం శంషాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత అమిత్ షా పార్టీ రాష్ట్ర నేతలతో అంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, డికే అరుణ, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా 2023 లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ అన్ని వర్గాలను కలుపుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో ఉండే సమర్థులైన నేతలను ఆహ్వానించాలని కోరారు. కేసీఆర్ పాలన తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని నివేదికలు అందాయని, కాంగ్రెస్ విఫలమైందని, ఆ లోటును భర్తీ చేస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించినట్లు తెలిసింది. తాను తెలంగాణతో పాటు ఆంధ్ర, కేరళ రాష్ట్రాలపై పోకస్ చేయనున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు. ఆంధ్రాలో కూడా టీడీపీ బలహీనపడిందని, వైఎస్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా బీజేపీని బలోపేతం చేయనున్నట్లు త్వరలో విజయవాడకు వెళ్లనున్నట్లు అమిత్ షా సంకేతాలు పంపించారు. ‘ తెలంగాణలో బీజేపీ బలపడేందుకు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు మంచి వాతావరణ నెలకొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అభివృద్ధి నిలిచిపోయింది. 4 లోక్‌సభ సీట్లను ప్రజలు ఇచ్చారంటే సామాన్య విషయం కాదు. కార్యకర్తలతో కలుపుగోలుగా ఉండండి. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానించండి. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా నడుచుకోరాదు అని అగ్రనేతలను కోరినట్లు తెలిసింది. పార్టీ సభ్యత్వ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఆయన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను అభినందించారు.